|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:34 PM
హాంకాంగ్ లోని ఓ నివాస సముదాయంలో ఏడు టవర్లు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 146కు చేరిందని అధికారులు తెలిపారు. మరో 150 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అగ్ని ప్రమాదం తర్వాత హాంకాంగ్ లోని భారీ అపార్ట్ మెంట్ బిల్డింగ్ లోపల సహాయక చర్యలు చేపట్టిన అధికారులు తాజాగా పలు ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. 1980 తర్వాత నివాస సముదాయాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో హాంకాంగ్ బిల్డింగ్ ప్రమాదమే అతిపెద్దదని చెప్పారు.
Latest News