|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:06 PM
వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళల నుంచి సాధారణ యువతుల వరకు వేధింపులు, అఘాయిత్యాలకు గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ముంబై, కోల్‌కతా నగరాల్లో వెలుగు చూసిన రెండు వేర్వేరు దారుణ ఘటనలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఒకచోట ప్రముఖ ఫార్మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఓ మహిళా వ్యాపారవేత్తను చంపేస్తానని బెదిరించి, నగ్నంగా మార్చి వీడియోలు తీయగా, మరోచోట క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న యువతిని పరిచయస్తులే కారులోకి లాగి అత్యాచారానికి పాల్పడ్డారు.వివరాల్లోకి వెళ్ళితే.... ముంబైకి చెందిన 51 ఏళ్ల మహిళా వ్యాపారవేత్తపై ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, వ్యవస్థాపక సభ్యుడు జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఓ సమావేశం పేరుతో పాస్కల్ తనను ఫార్మా కంపెనీ కార్యాలయానికి పిలిపించారు. అక్కడికి వెళ్ళాక, ప్రాణాలు తీస్తానని బెదిరించి దుస్తులు విప్పాలని బలవంతం చేశారు.ఆమె నిస్సహాయ స్థితిలో ఉండగా, నిందితుడు అసభ్య పదజాలంతో దూషిస్తూ తన నగ్న ఫోటోలు, వీడియోలు చిత్రీకరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియోలను బహిర్గతం చేస్తానని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులపై లైంగిక వేధింపులు, దాడి, క్రిమినల్ బెదిరింపుల కింద అభియోగాలు మోపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు, ఈ ఘటనలో నిందితుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Latest News