|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 02:18 PM
రాష్ట్రంలో అనేక చోట్ల ప్రభుత్వ ప్రోత్సహంతో టీడీపీ నేతలు కల్తీ మద్యం దందా కొనసాగిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవి కుమార్ మండిపడ్డారు. ఆముదాలవలస పార్టీ కార్యాలయంలో రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. `ఆముదాలవలస నియోజకవర్గంలోని టిడిపి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుడు ముఖలింగం కల్తీ మద్యం దందా నడుపుతున్నాడు. ఈ కల్తీ మద్యం కేసులో అమాయకులైన ఇద్దరు సేల్స్‌మెన్లపై కేసు నమోదు చేశారు. ఆముదాలవలస నియోజకవర్గంలో ఉన్న 20 మద్యం షాపుల్లో 15 మద్యం షాపులకు పైగా కూన రవికుమార్ నడుపుతున్నార. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం ఒక ఆర్గనైజర్ గా టీడీపీ నేతలు చేస్తున్నారు. నిందితుడు పైడి ముఖలింగం ఎమ్మెల్యే కూన రవికుమార్ కు బినామీ. గోవాలో కూన రవికుమార్ పాటు వైన్ షాప్ యజమాని తో తిరిగిన ఫోటోలు చుడండి(మీడియా సమావేశంలో ఫొటోల ప్రదర్శన). కల్తీ మద్యం ఇసుక దందా ద్వారా వచ్చిన డబ్బులతో గోవా నవోటల్, బీచ్ లో టిడిపి నేతలు తో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎంజాయ్ చేస్తున్నారు. కల్తీ మద్యం తయారుచేసి గ్రామాల్లో బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారు. దీనివల్ల గ్రామంలో ఉన్న అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అక్రమ మద్యం కేసులో ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేసు నమోదు చేయాలి. కల్తీ మద్యం అరికట్టే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది” అని రవికుమార్ హెచ్చరించారు.
Latest News