|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 02:13 PM
ఆదివారం కడప నగరంలో వైయస్ఆర్‌సీపీ జోన్–డివిజన్ కమిటీల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట పార్లమెంటరీ పరిశీలకులు కే. సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.... మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టమని టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డిని హెచ్చరించారు. “కడప ఎమ్మెల్యేకి మళ్లీ చెబుతున్నా… రెండు వేల మందితో కాదు, అయిదు వేల మందితో వస్తా” అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, తగ్గేదే లేదు” అని ప్రకటించారు. అక్రమ కేసులు పెట్టి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తే తాము కూడా తగిన తడాఖా చూపిస్తామని పేర్కొన్నారు.
Latest News