|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 01:55 PM
టీమీండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ప్రదర్శనను ప్రశంసించారు. రాంచీ వన్డేలో హర్షిత్ త్వరత్వరగా 2 వికెట్లు తీయడం జట్టుకు కలిసొచ్చిందని, లేదంటే దక్షిణాఫ్రికా 350 పరుగుల లక్ష్యాన్ని కూడా సులభంగా ఛేదించి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. డ్యూ ప్రభావం ఉన్నప్పటికీ, హర్షిత్ బంతిని చక్కగా స్వింగ్ చేసి, సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి వికెట్లు తీశారని కొటక్ తెలిపారు. టీమీండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
Latest News