|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 11:37 PM
ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు చలికాలంలో వెచ్చగా ఉండేందుకు వెచ్చగా ఉంచే బట్టలు వేసుకోవడం చేయాలి. లేదంటే చలికి రక్త ప్రసరణ తగ్గి నొప్పులు పెరుగుతాయి. ఎలాంటి వర్కౌట్స్ చేయకుండా ఉండే బదులు ఏవో కొన్ని వర్కౌట్స్ చేయడం మంచిది. దీని వల్ల పెయిన్స్ తగ్గుతాయి. హైడ్రేటెడ్‌గా ఉండడం కూడా ముఖ్యమే. దీంతో వాపు తగ్గుతుంది. దీంతో పాటు మెడిసిన్ లేకుండా సమస్యని తగ్గించుకునేందుకు న్యూట్రిషనిస్ట్ ఓ టిప్‌ని షేర్ చేశారు. ఆమె చెప్పిన పదార్థాలన్నింటినీ ఓ గుడ్డలో మూటలా కట్టి నొప్పులపై పెడితే నొప్పులు చాలా వరకూ తగ్గుతాయి. ఆ వివరాలేంటో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
2 టేబుల్ స్పూన్ల వాము
1 టేబుల్ స్పూన్ మెంతులు
1 టేబుల్ స్పూన్ సోంపు
1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు(ఆప్షనల్)
1 టేబుల్ స్పూన్ పసుపుపొడి
2 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు
ఆముదం లేదా నిర్గుండి నూనె లేదా ధన్వంతరమ్ నూనె
ఎలా తయారుచేయాలి
ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ పొడిగా వేయించాలి.
వీటన్నింటిని గుడ్డలో మూటలా కట్టాలి.
ఇప్పుడు నూనె వేడి చేయాలి.
వేడిగా ఉన్న నూనెలో పదార్థాలున్న మూటని కాస్తా ముంచాలి.
మనకి గోరువెచ్చగా ఉండేలా చూసుకుని మూటని నొప్పులు ఉన్న చోట కనీసం 7 నుంచి 10 సార్లు రాయండి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే నొప్పి తగ్గుతుంది.
నొప్పి ఎక్కువగా ఉంటే మెల్లిగా మసాజ్ చేయండి.
ఎప్పుడు చేస్తే మంచిది
పడుకునే ముందు ఇలా మసాజ్ చేయండి. 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేస్తే రెగ్యులర్‌గా చేస్తుంటే 7 నుంచి 10 రోజుల్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. నొప్పులు చాలా వరకూ తగ్గుతాయి. కాబట్టి, రెగ్యులర్‌గా చేయండి. ఇలా చేయడం వల్ల నొప్పులు బామ్స్ రాయకుండానే తగ్గుతాయి.
ఎలా పనిచేస్తుంది
ఇప్పుడు చెప్పినట్లుగా చేయడం వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ పెరుగుతుంది. జాయింట్స్‌లో కదలిక బాగుంటుంది. వాపు, నొప్పి, దృఢత్వం తగ్గుతుంది. రుమటాయిడ్, ఆస్టియోఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. వీటితో పాటు రెగ్యులర్‌గా వచ్చే బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాగూ నొప్పులు పెరుగుతాయి. ఇలాంటి టైమ్‌లో వెచ్చగా ఉంచే బట్టల్ని వేసుకోవడం, బాడీని వెచ్చగా ఉంచేందుకు హీటర్స్ వాడడం, వేడివేడి సూప్స్ తాగడం, కొద్దిపాటి వర్కౌట్స్ చేయడం వంటివి చేయాలి. హైడ్రేటెడ్‌గా ఉండడం కూడా ముఖ్యమే. దీని వల్ల నొప్పులు ఎక్కువగా ఉండవు.