|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 11:28 PM
దేశీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో రెండు దశాబ్దాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈక్విటీ పథకాల్లో ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ వాల్యూ ఫండ్ ఒకటి. ఈ స్కీమ్‌ను 2004, ఆగస్టు 16వ తేదీన లాంచ్ చేశారు. మార్కెట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఈ స్కీమ్ స్థిరమైన రాబడులు అందిస్తూ తమ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించింది. ఈ స్కీమ్ రాబడులు గత 3 ఏళ్లు, 5 ఏళ్లు, 7 ఏళ్లు, 10 ఏళ్లు, 15 ఏళ్లు, 20 ఏళ్ల సమయంలో ఎంత రాబడి అందించింది అనే వివరాలు తెలుసుకుందాం.
ఆస్తుల పరంగా చూస్తే భారత్‌లోని టాప్-10 స్కీమ్స్‌లో ఈ ఐసీఐసీఐ ప్రూ వాల్యూ ఫండ్ ఒకటి. అలాగే ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఇదే లార్జెస్ట్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ లాంచ్ అయి 21 ఏళ్ల 3 నెలల 12 రోజులు పూర్తి చేసుకుంది. అప్పుడు లంప్‌సమ్ పెట్టుబడి పెట్టి ఉంటే 48.5 రెట్లు లాభాలు అందించింది. ఇక నెలవారీగా రూ.5000 చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పొదుపు చేసిన వారికి రూ.1 కోటికి పైగా అందించింది.
వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ వాల్యూ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది. ఇందులో భాగంగా ఫండ్ మేనేజర్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నప్పుడు వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి స్టాక్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడ సైతం హైరిస్క్ ఉంటుంది. రిస్కో మీటర్‌లో వాల్యూ ఫండ్స్ వెరీ హై రిస్క్ కేటగిరీలోకి వస్తాయి. లంప్ సమ్ పెట్టుబడిపై లాంచ్ నుంచి ప్రతి ఏడాదికి 20.15 శాతం రాబడి అందించింది. రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.4,98,56,000 అవుతుంది. ఇక 3 ఏళ్లలో 21.23 శాతం, 5 ఏళ్లలో 25.18 శాతం, 7 ఏళ్లలో 19.83 శాతం, 10 ఏళ్లలో 15.76 శాతం, 15 ఏళ్లలో 16.52 శాతం, 20 ఏళ్లలో 17.53 శాతం మేర లాభాలు అందించింది.
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ వాల్యూ ఫండ్ సిప్ పనితీరు
గత 21 ఏళ్లలో వార్షిక రాబడులు 18.46 శాతం మేర రాబడులు ఇచ్చింది. నెలవారీగా రూ.5000 పొదుపు చేసినట్లయితే 21 ఏళ్లలో రూ.12,60,000 పెట్టుబడి అవుతుంది. దానిపై రూ.1,17,56,660 మేర వస్తుంది. నవంబర్ 27 నాటికి నెట్ అసెట్ వాల్యూ రూ.498.56 కోట్లుగా ఉంది. ఈ స్కీమ్ ఏఎంయూ వాల్యూ రూ.55,444.54 కోట్లుగా ఉంది. ఎక్స్‌పెన్ష్ రేషియో 1.50 శాతంగా ఉంది.
Latest News