|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 04:06 PM
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు లేదని డీకే శివకుమార్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ, ఆ ప్రకటన వెనక ఒక భారీ రాజకీయ డ్రామా దాగి ఉందని ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం చెబుతోంది. పార్టీని అధికారంలోకి తెచ్చిన కీలక వ్యక్తిగా డీకేపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఆయన్ను సీఎంగా చేస్తే సిద్దరామయ్య సహకరిస్తారా అన్న సందేహంతో కాంగ్రెస్ హైకమాండ్ రహస్య ఎంక్వైరీ చేపట్టింది. ఆ ఎంక్వైరీలో బయటపడిన సమాచారం ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సైలెంట్ మూడ్‌లో కనిపిస్తున్న సిద్దరామయ్య అసలు ప్లాన్ ఏమిటంటే.. తనకు అన్యాయం జరిగితే బీజేపీతో చేతులు కలపడానికి కూడా వెనుకాడని సంకేతాలు ఇస్తున్నారట. ఇప్పటికే తన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు డీకే వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, సీఎం మార్పు జరిగితే పార్టీలో భారీ షాక్ ఎదుర్కొనే ప్రమాదం ఉందని హైకమాండ్ భయపడుతోంది. అందుకే ఈ విషయంలో అతి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
ఇదే అంశంపై ఢిల్లీలో జరిగిన సీక్రెట్ సర్వేలో సిద్దరామయ్య వర్గం నుంచి స్పష్టమైన హెచ్చరిక వచ్చిందట – “సీఎం సీటు జారితే.. కమలం ద్వారం తెరుచుకుంటుంది” అని. తను గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా డీకే గ్యాంగ్‌లో చేరిపోతే, తన బలం ఏమీ మిగలదని సిద్దూ ఆందోళన వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డీకే ఒక్కసారిగా వెనక్కి తగ్గారు.
ఫలితంగా డీకే శివకుమార్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవితోనే, పార్టీలో తన పట్టు కోల్పోకుండా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. సిద్దరామయ్య రివాల్వర్ ఇంకా లోడ్ అయి ఉన్న నేపథ్యంలో.. ఢిల్లీ కూడా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోయినట్లు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్‌లో ఈ రివర్స్ డ్రామా ఇంకా కొనసాగనుందా అన్నదే ఇప్పుడు అందరి అంచనా!