|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 12:28 PM
ప్రపంచస్ధాయి రాజధాని నిర్మాణం పేరుతో సీఎం చంద్రబాబు రైతులను దగా చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... పదేళ్ల క్రితమే 32 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ఇప్పటివరకు ఎందుకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదని నిలదీశారు. నాడు రైతులను త్యాగధనులంటూ కీర్తించిన బాబు.. నేడు అపాయింట్ మెంటుకూ నోచుకోవడం లేదని మండిపడ్డారు. రాజధాని కోసం ప్రభుత్వ భూములు కలుపుకుని 50 వేల ఎకరాలు సేకరించిన చంద్రబాబు.. కేవలం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే రెండో విడతలో మరో 20 వేల ఎకరాలు సేకరణకు సిద్ధమవడాన్ని తప్పుపట్టారు. నాడు రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ గొప్పలు చెప్పి... నేడు అప్పు కోసం ప్రపంచమంతా తిరుగుతున్న చంద్రబాబే అమరావతికి అసలైన విలన్ అని స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం 50 వేల ఎకరాల్లో ప్రపంచస్ధాయి రాజధానిని నిర్మిస్తామన్న చెప్పిన చంద్రబాబు.. ఇవాళ మాటమార్చి 50 వేల ఎకరాలు అంటే మున్సిపాల్టీ అవుతుంది.. మరో 50వేల ఎకరాలు సేకరిస్తే తప్ప ప్రపంచస్దాయి రాజధాని కాదని చెబుతున్నారు. చంద్రబాబు గారూ మీది నోరా? తాటిమట్టా? కేవలం అమరావతిని అడ్డుపెట్టుకుని దోచుకునే కార్యక్రమం తప్ప మరొక్కటి కాదు అని తెలిపారు.
Latest News