|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 10:47 PM
బయటి నుంచి కొనుక్కొచ్చే ఏ మాయిశ్చరైజర్ అయినా ఒకట్రెండు గంట్లోనే దాని పవర్ తగ్గిపోయినట్లుగా అయిపోతుంది. ఎక్కువసేపు మాయిశ్చరైజ్డ్‌గా ఉండాలంటే దానికి అంతే ఖర్చు కూడా చేయాలి. అందరూ అలా ఖర్చు చేయలేరుగా. పైగా కెమికల్స్ ఉండే మాయిశ్చరైజర్స్ వాడడం కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటి వారు ఇంట్లోనే వారంతట వారు చక్కని హైడ్రేటెడ్ మాయివ్చరైజర్స్ తయారుచేసి వాడొచ్చు. వీటిని రాయడం వల్ల స్కిన్ హైడ్రేట్‌గా, మాయిశ్చరైజర్డ్‌గా ఉంటుంది. ఇందులోని కలిపే పదార్థాలన్నీ కూడా ఇంట్లోవే దొరికేవే. పైగా స్కిన్‌కి మేలు చేసేవే. మరి అలాంటి పదర్థాలు ఏంటి? వాటిని ఎలా తయారు చేయలో తెలుసుకోండి.
మీకు నచ్చిన నూనెతో
ఏదైనా మంచి నేచురల్ ఆయిల్ తీసుకోండి. అందులో కొబ్బరినూనె, జొజొబా, షియా బటర్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు. వీటిని వాడడం వల్ల కలిగే లాభాలేంటంటే
కొబ్బరినూనె : యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో ఉన్న నూనె. స్కిన్ కేర్ కోసం ఎప్పుడు కూడా ప్రాసెస్ కానీ ఆయిల్ వాడడం మంచిది. జొజొబా ఆయిల్: చర్మం త్వరగా గ్రహించే జొజొబా గింజల నుండి ఈ ఆయిల్‌ని తీస్తారు. షియా బటర్ : ఎక్కువగా డ్రైగా ఉండే స్కిన్ కోసం థిక్ క్రీమ్ ఇది. ఆర్గాన్ : ఈ నూనెని రాయడం వల్ల మంట కూడా డ్రైనెస్ చాలా వరకూ తగ్గుతుంది.
అలాగే ఆలివ్ ఆయిల్ కూడా వాడొచ్చు.
అలోవెరా జెల్ కలపండి
మీకు నచ్చిన నూనె ఓ గిన్నెలో తీసుకుని అందులో అలొవెరా జెల్ కలపండి. ఓ స్పూన్ పరిమాణంలో ఇందులో వేయండి. దీనిని బాగా కలపండి. అలోవెరా జెల్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నింటిని దూరం చేసి స్కిన్‌ని హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. దీనిని బయటి నుంచి కొనుక్కురావొచ్చు. లేదా ఇంట్లో ఉన్న చెట్టు కొమ్మ నుంచి కూడా తీయొచ్చు. కొమ్మలోని మధ్యలోని గుజ్జుని మాత్రమే తీసుకోవాలి.
నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్
ఇప్పుడు ఆ పదార్థాలలో 4 నుంచి 5 చుక్కల నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ వేయండి. ఇవి ఎలాంటి గ్లోయింగ్‌ని అందించవు. కానీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యల్ని దూరం చేసి మచ్చలు, గీతల్ని తగ్గిస్తాయి. కాబట్టి, లావెండర్, జెరేనియం వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌లో ఏదో ఒకటి కలపండి.
బాగా కలపండి
ఇప్పుడు వేసిన పదార్థాలన్నింటినీ బాగా కలపండి. వీటిని బాగా చిక్కబడేవరకూ కలపండి. పదార్థం ఎక్కువగా ఉంటే మీరు హ్యాండ్ హెల్డ్ ఎలక్ట్రిక్ మిక్సర్‌ని కూడా వాడొచ్చు. దీనిని వాడడం వల్ల క్రీమ్‌లా మారుతుంది. దీనిని మీరు మాయిశ్చరైజర్‌లా వాడొచ్చు. దీనిని ముఖం, స్కిన్‌కి కూడా వాడొచ్చు.
స్టోర్ చేసి వాడడం
ఇప్పుడు తయారుచేసిన మాయిశ్చరైజర్‌ని ఎయిర్‌టైట్ కంటెయినర్‌లో వేసి స్టోర్ చేయండి. దీనిని మీరు రోజూ ఉదయం సాయంత్రం ముఖం, స్కిన్‌కి రాయొచ్చు. ఇవన్నీ నేచురల్ పదార్థాలే అయినప్పటికీ వాడే ముందు మీకు పడుతుందా లేదా అనేది ప్యాచ్ టెస్టు చేయడం మంచిది.
Latest News