|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 07:29 PM
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు తెలిపారు. శుక్రవారం 70,044 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 25,559 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.47 కోట్లుగా నమోదైంది. తెనాలికి చెందిన రామకృష్ణ కిలారి అనే భక్తుడు అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం అందించారు.
Latest News