|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 05:48 PM
భారతీయ రైల్వే ప్రయాణికులపై ఛార్జీల భారం మోపడానికి సిద్ధమైంది. కొన్నేళ్లుగా స్థిరంగా ఉన్న ప్రయాణ ఛార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ఛార్జీలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు, తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో కూడా భారతీయ రైల్వే కీలక మార్పులు చేసింది. ఇకపై తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి కానుంది. వివరాల్లోకి వెళితే, నాన్-ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ ఛార్జీ కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున పెరగనుంది. ఏసీ తరగతుల్లో ప్రయాణానికి కిలోమీటర్‌కు రెండు పైసల చొప్పున ఛార్జీలు పెంచనున్నారు. అయితే, సబర్బన్ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అలాగే, 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సెకండ్ క్లాస్ టికెట్ల ధరల్లో కూడా ఎటువంటి పెంపు ఉండదు. 500 కిలోమీటర్లకు మించిన దూరాలకు మాత్రం సెకండ్ క్లాస్ ప్రయాణంలో కిలోమీటర్‌కు అర పైసా చొప్పున ఛార్జీ పెరగనుంది. నెలవారీ సీజన్ టికెట్ల (ఎంఎస్‌టీ) ధరల్లో కూడా ఎటువంటి పెంపు లేదని రైల్వే శాఖ తెలిపింది. ఈ కొత్త ఛార్జీల విధానం జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది.
Latest News