|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 02:18 PM
నిత్య పెళ్లికూతురు వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. ఆమె రివర్స్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు ఆరోపణలు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాను నిత్య పెళ్లికూతురుని కాదని వివరణ ఇచ్చింది. తాను మోసం చేశానంటున్న 12 మందిని తీసుకువచ్చి నిజనిజాలు తేల్చండి అంటూ సవాల్ చేసింది. న్యాయం కోసం తాను చాలా మంది రాజకీయ నాయకులకు పిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా రెండేళ్లలో ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నిత్య పెళ్లికూతురి బాగోతంపై పలువురు బాధితులు అమలాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
Latest News