|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 02:09 PM
సుపరిపాలనలో తొలి అడుగు కింద ఏడాది కాలంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, పార్లమెంట్ పరిధిలోని రైల్వేస్టేషన్‌లు ఆధునీకరించటంతో పాటు రహదారులను అభివృద్ధి చేశామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ ఆటోనగర్ రూపురేఖలు మార్చి లారీల ప్రవేశ అనుమతులు సులభతరం చేశామన్నారు. వచ్చే 40 ఏళ్లలో భక్తుల తాకిడి తట్టుకునేలా దుర్గగుడి వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్నామని, కృష్ణ పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామని కేశినేని చిన్ని చెప్పారు. కొండ ప్రాంతాల్లో నీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు.
Latest News