ఆడవారిలో పొత్తి కడుపు తొడల్లోని కొవ్వు కరిగించే డిటాక్స్ డ్రింక్
 

by Suryaa Desk | Mon, Jun 23, 2025, 11:56 PM

హార్మోన్స్ సరైన విధంగా లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక్కసారి ఇంబ్యాలెన్స్ అయ్యాయంటే శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా త్వరగా వీళ్ల బాడీలో మార్పులు వచ్చేస్తాయి. పొత్తి కడుపు చుట్టూ విపరీతంగా కొవ్వు పేరుకుపోతుంది. ఫ్యాట్ పెరగడం వల్ల చాలా లావుగా కనిపిస్తారు. వ్యాయామాలు చేసి దీన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు. కానీ..హార్మోన్స్ సమస్య ఉన్నప్పుడు అందుకు తగ్గట్టుగానే పరిష్కారం ఆలోచించాలి.


దీని గురించే వివరించారు హెల్త్ ఎక్స్ పర్ట్ మన్ ప్రీత్. మహిళల్లో సంతానానికి చాలా ముఖ్యమైన ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యకు ఓ సొల్యూషన్ చెప్పారు. కేవలం ఒకే ఒక డ్రింక్ తో చెక్ పెట్టవచ్చని వివరించారు. ఈస్ట్రోజెన్ డిటాక్స్ డ్రింక్ గా చెబుతున్న ఈ నేచురల్ మెడిసిన్ ని ఎలా తయారు చేసుకోవాలి. ఏయే పదార్థాలు కలపాలి. ఈ వివరాలన్నీ చూద్దాం.


హార్మోన్ సమస్యలు


ఆడవారిలో 40 ఏళ్లు దాటగానే హార్మోన్ సమస్యలు మొదలవుతాయి. కొందరికి అంత కన్నా ముందే ఈ ఇబ్బందులు వస్తాయి. అయితే.. మగవారిలోనూ ఈ సమస్య వచ్చినప్పటికీ..ఆడవారిలో ఎఫెక్ట్ చాలా త్వరగా కనిపిస్తుంది. శరీరంలో అనుకోని మార్పులన్నీ వస్తాయి. విపరీతంగా నీరసపడిపోతారు. ఉన్నట్టుండి బరువు పెరుగుతారు. ఏమీ తినకపోయినా వెయిట్ పెరుగుతూనే ఉంటుంది. పొట్ట, పొత్తి కడుపు, తొడల భాగాల్లో విపరీతంగా కొవ్వు పెరిగిపోతుంది. ఫలితంగా చాలా లావుగా కనిపిస్తారు. దీని వల్ల మానసికంగానూ కుంగిపోతారు. ఫిజికల్ యాక్టివిటీస్ తో కొవ్వు కరిగించుకోవచ్చు. అదే సమయంలో డైట్ లో ఓ డ్రింక్ ని కూడా చేర్చుకుంటే చాలా త్వరగా ఫలితాలు చూడవచ్చు అని చెబుతున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్ మన్ ప్రీత్.


ఈస్ట్రోజెన్ డిటాక్స్ డ్రింక్


ఈస్ట్రోజెన్ హార్మోన్ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఆడవారిలో ఈ ఇబ్బందులు వస్తాయి. అయితే..ఓ డిటాక్స్ డ్రింక్ తో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవాలంటే కొన్ని పదార్థాలు కావాలి. జీలకర్ర, అవిసె గింజలు, ధనియాలు అవసరం అవుతాయి. వీటితో పాటు మెంతులు, ఇసబ్ గోల్ పొడి కూడా అవసరం. అయితే..ఈ పదార్థాలన్నింటికీ ఒక్కో రకమైన ఔషధ గుణాలున్నాయి. వీటన్నింటినీ కలిపి తీసుకున్నప్పుడు ఆ ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని చెబుతున్నారు మన్ ప్రీత్. వీటిని ఏ మోతాదులో తీసుకుంటే సరైన డిటాక్స్ డ్రింక్ తయారవుతుందో కూడా వివరించారు. మరి ఈ ప్రాసెస్ ఏంటి. ఎంత యాడ్ చేసుకుంటే ఈ డ్రింక్ పర్ ఫెక్ట్ గా రెడీ అయిపోతుందో చూద్దాం.


ఎలా తయారు చేసుకోవాలి


ఈ డ్రింక్ తయారు చేయడానికి ముందుగా ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. దీంతో పాటు ఓ టేబుల్ స్పూన్ అవిసె గింజలు కావాలి. ఓ టేబుల్ స్పూన్ ధనియాలు, ఓ టేబుల్ స్పూన్ మెంతులు, ఓ టేబుల్ స్పూన్ ఇసబ్ గోల్ పౌడర్. ముందుగా జీలకర్రని రోస్ట్ చేయాలి. ఆ తరవాత మెంతులు, ధనియాలు, అవిసె గింజలను కూడా కాస్త తక్కువ మంట పెట్టి వేయించుకోవాలి. తరవాత వాటిని చల్లారబెట్టాలి. చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి. అది మెత్తగా పొడిగా మారేంత వరకూ చూడాలి. ఈ పొడిని ఓ గ్లాస్ జార్ లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో ఓ టేబుల్ స్పూన్ ఇసబ్ గోల్ పొడి కలపాలి. అన్ని పదార్థాలు కలిసేలా మిక్స్ చేయాలి. ఇలా ఈస్ట్రోజన్ డిటాక్స్ డ్రింక్ కి అవసరమైన పౌడర్ తయారైపోతుంది.


ఎలా వాడితే మంచిది


ఈ పొడిని రోజూ ఓ టేబుల్ స్పూన్ మేర వాడితే సరిపోతుంది. అయితే..గోరువెచ్చని నీళ్లలో ఈ పౌడర్ కలిపి తీసుకోవాలి. ఓ గ్లాస్ నీళ్లలో మిక్స్ చేసి రోజూ ఉదయమే పరగడుపున తీసుకోవాలి. భోజనానికి కనీసం అరగంట ముందు తాగితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య తగ్గిపోతుంది. ఈ డ్రింక్ రోజూ తాగడం వల్ల బోలెడన్ని లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఎన్నో రోజులుగా పేరుకుపోయిన ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. అంతే కాదు. 35 ఏళ్లు పైబడిన ఆడవారిలో మెటబాలిజం మెరుగయ్యేందుకూ ఇది తోడ్పడుతుంది. పెరీమెనోపాజ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ డ్రింక్ తీసుకుంటే ఆరోగ్యం అందుతుంది.


ఎన్నో లాభాలు


జీలకర్ర వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగవుతుంది. అవిసె గింజల్లో ఉండే పోషకాల వల్ల ఎన్నో లాభాలుంటాయి. అయితే..ముఖ్యంగా ఇందులో ఉండే లిగ్నాన్స్ ఈస్ట్రోజెన్ హార్మోన్స్ బ్యాలెన్స్ డ్ గా ఉండేలా చూస్తాయి. ఇక ధనియాలు అధికంగా ఉన్న ఈస్ట్రోజెన్ ని తగ్గించి శరీరంలో అదనంగా ఉన్న నీరునీ బయటకు పంపేస్తాయి. మెంతులు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడంతో పాటు హార్మోనల్ హెల్త్ ని కాపాడతాయి. ఇసబ్ గోల్ పొడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య కూడా తీరిపోతుంది. పైగా..ఇది ఈస్ట్రోజెన్ డిటాక్స్ లా పని చేస్తుంది.

Latest News
Five new poliovirus cases detected in Pakistan's Karachi Thu, May 07, 2026, 03:11 PM
Op Sindoor not over, it is the beginning: Armed Forces' message on first anniversary Thu, May 07, 2026, 03:10 PM
'Pakistan requested to stop': Ex-DGMO Rajiv Ghai gives detailed account of Op Sindoor on anniversary Thu, May 07, 2026, 03:07 PM
Bihar Cabinet expansion: Sons of three former CMs inducted in Samrat Choudhary govt Thu, May 07, 2026, 03:03 PM
Rights body flags surge in sexual violence cases in Bangladesh madrasas Thu, May 07, 2026, 03:01 PM