విశాఖపట్నంలో 'తృప్తి క్యాంటీన్‌‌'లు.. తక్కువ ధరలకే బిర్యానీ, టిఫిన్‌లు.. మహిళలకు మాత్రమే ఛాన్స్
 

by Suryaa Desk | Mon, Jun 23, 2025, 09:28 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 'తృప్తి' క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజల కోసం అన్న క్యాంటీన్లతో పాటుగా ఇప్పుడు డబ్బులు చెల్లించుకోగలిగే వారికి రుచికరమైన భోజనం అందించేందుకు ఈ క్యాంటీన్లను తీసుకొచ్చింది. తాజాగా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం 'తృప్తి' క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది.. నగరంలో ఎంపిక చేసిన ఐదు ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ఉంటాయి. మహిళలకు ఉపాధి కల్పించాలనేది దీని ముఖ్య ఉద్దేశంతో వీటిని తీసుకురాగా.. డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఇక్కడ చికెన్, మటన్ బిర్యానీలు కూడా అక్కడ దొరుకుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, 'సారా' సంస్థ కలిసి ఈ ప్రాజెక్టును రూపొందించాయి. .


విశాఖపట్నంలో తృప్తి క్యాంటీన్ల ఏర్పాటుకు జీవీఎంసీ అధికారులు ఐదు ప్రాంతాలను ఎంపిక చేశారు. నగరంలో జన సంచారం ఎక్కువగా ఉండే ఆర్కేబీచ్ బస్టాప్, కేజీహెచ్, ద్వారకా బస్టాండ్, కూర్మన్నపాలెం దగ్గర ఈ క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో క్యాంటీన్ల ఏర్పాటును పాలకవర్గ సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాంటీన్ల కోసం ఎంపిక చేసిన ఆర్కేబీచ్‌ ప్రాంతంలో సందర్శకులు తృప్తి క్యాంటీన్లను ఆశ్రయించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేజీహెచ్ దగ్గర ఇప్పటికే అన్న క్యాంటీన్ ఉందని.. కాబట్టి దీనిని వేరే చోట ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు. కూర్మన్నపాలెంలో రెండు క్యాంటీన్లు అవసరం లేదంటున్నారట.


కంటైనర్ తరహాలో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు. సారా సంస్థతో పాటు మహిళలు తృప్తి క్యాంటీన్ల ఏర్పాటుకు పెట్టుబడి పెడతారు. ఈ క్యాంటీన్లకు సంబంధించి ఒక్కో మహిళ రూ.2.75 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు నలుగురు మహిళలకు కలిసి రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టాలి.. మిగతా రూ.3.50 లక్షలు సారా సంస్థ అందజేస్తుంది. ఈ క్యాంటీన్ల కోసం మహిళలకు బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తారు.. జీవీఎంసీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. ఈ క్యాంటీన్‌కు సంబంధించి కంటైనర్ ఏర్పాటు చేసే స్థలానికి జీవీఎంసీకి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. ఆహార పదార్థాల ధరలపై క్లారిటీ లేదు.. త్వరలో దీనిపై మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ తృప్తి క్యాంటీన్లలోటిఫిన్‌త పాటుగా చికెన్, మటన్ బిర్యానీలు విక్రయిస్తారు. మొత్తం మీద త్వరలోనే విశాఖపట్నంలో ఈ క్యాంటీన్‌లు ప్రారంభంకానున్నాయి.


ఇప్పటికే ఈ క్యాంటీన్లను నెల్లూరులో ప్రారంభించిగా విజయవంతంగా నడుస్తున్నాయి... మిగిలిన నగరాల్లోనూ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ లిస్ట్‌లో విజయవాడతో పాటుగా విశాఖపట్నం కూడా ఉంది. ఈ క్యాంటీన్లను డ్వాక్రా సంఘాల మహిళలతో ఏర్పాటు చేయిస్తున్నారు.. బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందిస్తున్నారు.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM