|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 07:52 PM
AP: బనకచర్ల వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టు ఏపీకి గేమ్ ఛేంజర్ కానుందని చెప్పారు. అమరావతిలో నిర్వహిస్తోన్న ‘సుపరిపాలన-తొలి అడుగు’ సదస్సులో మాట్లాడారు. ‘‘గోదావరి జలాల వినియోగంతో 2 రాష్ట్రాలు బాగుపడతాయి. మిగులు జలాలను రెండు రాష్ట్రాలూ వాడుకోవచ్చు. ఎంతగా వాడుకున్నా 200 టీఎంసీలు మాత్రమే వాడుకోగలం’’అని పేర్కొన్నారు.అధికారంలోకి రాగానే నాలుగు సంతకాలు పెట్టానని సీఎం చంద్రబాబు అన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. వైకాపా హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్థం చేశారు. వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. 213 అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం పెడుతున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,400 కోట్లు సాయం చేసింది. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని పేర్కొన్నారు.
Latest News