|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 06:23 PM
ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైయస్ఆర్‌సీపీ పోరుబాట పట్టింది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైయస్ఆర్‌సీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో యువత, విద్యార్థులు కదం తొక్కారు. మాట తప్పి.. వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లా కలెక్టరేట్ల వద్ద వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌లకు యువతీయువకులతో కలిసి వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించారు. ధర్నాచౌక్‌లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిరసన కార్యక్రమం చేపట్టారు.
Latest News