|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 04:29 PM
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో పంత్ తన ప్రవర్తనతో వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఫీల్డ్ అంపైర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగడమే కాకుండా, బంతిని మైదానంలోకి విసిరికొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో పంత్ ఐసీసీ నుంచి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 61వ ఓవర్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని ఇంగ్లీష్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత బంతి ఆకృతి, పరిస్థితిపై రిషభ్ పంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వెంటనే బంతిని తీసుకుని ఆన్-ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ వద్దకు వెళ్లి, దానిని పరిశీలించాలని కోరాడు. అంపైర్ రీఫెల్ బాల్ గేజ్‌తో బంతిని పరీక్షించి, అంతా సవ్యంగానే ఉందని, బంతి ఆకృతిలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు.అయితే, అంపైర్ సమాధానంతో పంత్ సంతృప్తి చెందలేదు. అసహనం ప్రదర్శిస్తూ, చేతిలోని బంతిని గట్టిగా మైదానంలోకి విసిరికొట్టి అక్కడి నుంచి ముందుకు నడిచాడు. పంత్ ఈ విధంగా ప్రవర్తించడం అనవసరమని ఆ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న వ్యాఖ్యాత మార్క్ బౌచర్ అభిప్రాయపడ్డాడు.
Latest News