|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 04:27 PM
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంకొల్లు గంగవరం రోడ్డులో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్‌కు పలు గ్రామాల్లో పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి స్వాగతం లభించింది.ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లోకేశ్, సైనిక్ స్కూల్ ప్రధాన భవనంతో పాటు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, బాలురు బాలికల వసతి సముదాయాలు, క్యాంటీన్, మెస్ భవనాలను సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేశ్ చెంచురామ్‌తో కలిసి ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను కూడా మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తదితరులు హాజరయ్యారు.
Latest News