|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 02:09 PM
శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వరుస సెలవులు, సోమవారం శివుని ప్రీతికర దినం కావడంతో భక్తులు వేకువజామున నుంచే పాతాళగంగలో స్నానాలు చేసి దర్శనార్థం తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 1 గంట సమయం పడుతుంది. మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు, సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మూడు విడతలుగా ఉదయం 7:30 కు మధ్యాహ్నం 2.30 కు రాత్రి 9 గంటలకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు.
Latest News