అమెరికా దాడుల‌ను తీవ్రంగా ఖండించిన ఖ‌మేనీ
 

by Suryaa Desk | Mon, Jun 23, 2025, 09:49 AM

తమ దేశంలోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయ‌డంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికాలు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రతిస్పందన కఠినంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఆయన సోమవారం ఎక్స్  వేదిక‌గా హెచ్చరించారు. ఈ దుందుడుకు చర్యకు పాల్పడిన శత్రువులు తీవ్రమైన శిక్షను ఎదుర్కొంటారని ఆయన ప్రతినబూనారు.ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఖమేనీ తొలిసారిగా స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ఒక పోస్ట్ చేశారు. "శిక్ష కొనసాగుతోంది. జయోనిస్ట్ శత్రువు  చాలా పెద్ద తప్పు చేసింది. ఘోరమైన నేరానికి పాల్పడింది. దానికి శిక్ష పడుతోంది. అది త‌ప్ప‌కుండా శిక్ష అనుభవిస్తుంది" అని ఖమేనీ తన పోస్టులో పేర్కొన్నారు.ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో కొంతకాలంగా పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా దాడుల ఆరోపణలతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ వైపు నుంచి ఎలాంటి ప్రతిచర్యలు ఉంటాయోనన్న ఆందోళన అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతోంది.

Latest News
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM
IPL 2026: When and Where to watch RR vs DC, know all details Thu, Apr 30, 2026, 04:25 PM
Mumbai court orders defreezing of Rhea Chakraborty, mother's bank account in NPDS case Thu, Apr 30, 2026, 04:18 PM
BJP welcomes Bengal CEO's repoll directive; Oppn INDIA bloc raises concern over EVM tampering Thu, Apr 30, 2026, 04:13 PM
Sensex, Nifty end lower amid rising crude oil prices Thu, Apr 30, 2026, 04:01 PM