విటితో ఇంట్లోనే రూమ్ స్ప్రే తయారు చేసుకోవచ్చు
 

by Suryaa Desk | Sun, Jun 22, 2025, 11:29 PM

ఇంట్లో మూలల నుంచి వస్తున్న వాసనను పోగొట్టాలంటే రూమ్ స్ప్రేలు వాడుతుంటారు. అయితే.. ఇలా ప్రతిసారీ ఫ్రెషనర్స్ కొనాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే చాలా సులువుగా వీటిని తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.


రూమ్ స్ప్రే


రోజంతా ఆఫీస్ లో పని చేసి అలిసిపోయి ఇంటికి వెళ్లగానే ఇల్లంతా ఫ్రెష్ గా లేకపోతే ఎలా ఉంటుంది. బాగా చిరాకు పుడుతుంది కదూ. అవును కాస్త రెస్ట్ తీసుకుందామనుకుంటే ఏదో ఓ స్మెల్ వచ్చి ఇబ్బంది పెడుతుంది. అయితే... ఈ సమస్య లేకుండా చాలా మంది ఇప్పుడు రూమ్ ఫ్రెషనర్స్ వాడుతున్నారు. ఓ టైమ్ సెట్ చేసి పెడితే చాలు. సరిగ్గా ఆ సమయానికి అది సెంట్ ని స్ప్రే స్తుంది. ఇల్లంతా ఆ సువాసన ఘుమఘుమలాడిపోతుంది.


ఆ స్మెల్ తో మనసు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ..ఇలా ప్రతిసారీ రూమ్ ఫ్రెషనర్స్ కొనాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అలా కాకుండా చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగితే ఎంత బాగుంటుంది కదా. అలాంటి ఓ చిట్కానే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎక్కువ హడావుడి లేకుండా చాలా తక్కువ పదార్థాలతోనే ఇల్లంతా సువాసనతో నిండిపోయే రూమ్ ఫ్రెషనర్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.


ఇంట్లోనే తయారీ


ఇంట్లో రకరకాల వస్తువులుంటాయి. ఎంత క్లీన్ చేస్తున్నా ఎక్కడో ఓ మూల దుమ్ము, ధూళి పేరుకుపోతూనే ఉంటుంది. అయితే..ఈ దుమ్ముతో పాటు కొన్ని చోట్ల చెమ్మ చేరుతుంది. సామాన్లు పెరిగే కొద్దీ ఇంట్లో వాసన కూడా మారిపోతుంది. ఎక్కువ సేపు తలుపులు మూసేసి ఉన్నా ఇలాంటి ఇబ్బంది వస్తుంది. అయితే..ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చిన ప్రతిసారీ రూమ్ స్ప్రే వాడతారు. ఇలా చేయడం మంచిదే అయినా..కొన్ని సార్లు ఈ స్మెల్ అందరికీ పడకపోవచ్చు. అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో కెమికల్స్ కలవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే స్ప్రే తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ గా. చాలా తక్కువ పదార్థాలతోనే తయారీ పూర్తవుతుంది.


కావాల్సిన పదార్థాలు


ఇంట్లోనే రూమ్ స్ప్రే తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు కేవలం నాలుగు పదార్థాలు సరిపోతాయి. రోజా పూలు, నీళ్లు, పచ్చ కర్పూరం, జవ్వాది పొడి. కేవలం ఈ పదార్థాలతోనే నేచురల్ స్ప్రే తయారైపోతుంది. రోజా పూలల్లో సహజంగానే ఫ్రాగ్నెన్స్ ఉంటుంది. తాజాగా ఉన్నప్పుడు వాటి పరిమళం మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది. ఇక పచ్చ కర్పూరం కూడా సువాసనను పంచుతుంది. పైగా ఇందులో ఉండే ఘాటుదనం వల్ల క్రిములు, దోమలు, బ్యాక్టీరియా లాంటివి ఇంట్లో నుంచి తొలగిపోతాయి. ఇక జువాది కూడా చాలా మంచి వాసనను పంచుతుంది. ఆలయాల్లో ఈ పొడిని ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పుడు చెప్పిన విధంగా తయారు చేసుకుంటే ఇంట్లోనూ గుడి లాంటి వాతావరణం వచ్చేస్తుంది.


ఎలా తయారు చేసుకోవాలి


ముందుగా ఓ కప్పులో తాజా గులాబీ రెక్కలు తీసుకోవాలి. వాటిని మిక్సీ జార్ లో వేసి ఓ కప్పు నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడబోసి ఆ నీళ్లను పక్కన పెట్టుకోవాలి. అందులో ఓ పచ్చ కర్పూరం వేయాలి. అయితే..పచ్చ కర్పూరం అందుబాటులో లేకపోతే మామూలు కర్పూరం అయినా వాడొచ్చు. కాకపోతే పచ్చ కర్పూరం వల్ల సువాసన ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఆ తరవాత పూజా స్టోర్స్ లో దొరికే జువాది పొడిని తీసుకురావాలి. కేవలం ఓ చిన్న స్పూన్ పొడి వేసినా సరిపోతుంది. చాలా ఎక్కువగా స్మెల్ వస్తుంది. తరవాత ఈ నీళ్లను బాగా మిక్స్ చేసి ఓ స్ప్రే బాటిల్ లో పోయాలి. ఇలా కాసేపట్లోనే రూమ్ ఫ్రెష్ నర్ తయారైపోతుంది.


ఇలా వాడుకోవచ్చు


ఈ ఫ్రెష్ నర్ ని ఇంట్లో అన్ని మూలల్లోనూ స్ప్రే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా దుర్వాసన వచ్చే కర్టెయిన్స్, సోఫాలపై స్ప్రే చేసుకుంటే మంచిది. రోజంతా సువాసన వస్తుంది. ఇందులో వాడిన రోజా పూలు, కర్పూరం, జవ్వాది..ఇలా అన్ని పదార్థాలూ ఎక్కువ సేపు ఫ్రాగ్నెన్స్ ఇచ్చేవే. అందుకే..ఓ సారి స్ప్రే చేస్తే రోజంతా ఇల్లు అదే వాసనతో నిండిపోతుంది. పైగా పెద్ద ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎప్పుడంటే అప్పుడు ఈ ఫ్రెష్ నర్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు రెడీ చేసుకుని ఇల్లంతా స్ప్రే చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంట్లో ఫంక్షన్స్, పార్టీలు అయినప్పుడు వాడితే ఇంకా బాగుంటుంది.


గులాబీలతో ఆహ్లాదం


రోజా పూల పరిమళం మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది. అందుకే..చాలా వరకూ రూమ్ స్ప్రే లలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. రోజ్ వాటర్ కూడా చాలా మంది వినియోగిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే స్కిన్ కేర్ కోసం ఎక్కువగా వాడతారు. చర్మంపై ఉన్న మురికిని మొత్తం ఇవి వదిలిస్తాయి. కర్పూరాన్ని ఎక్కువగా పూజా ద్రవ్యాలలో వాడతారు. దీంతో నూనె, బామ్ లు తయారు చేస్తారు. వైద్య శాస్త్రంలోనూ కర్పూరానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది గాలిని ఫిల్టర్ చేయడంలో చాలా బాగా పని చేస్తుంది. ముఖ్యంగా గాలిలో ఉండే బ్యాక్టీరియాను చంపేస్తుంది.

Latest News
Internet major Naver's Q1 net profit falls 31.3 pct on forex losses Thu, Apr 30, 2026, 11:35 AM
PLI booster: Apple iPhone exports hit record Rs 2 lakh crore in FY26 Thu, Apr 30, 2026, 11:34 AM
TN targets full literacy with new drive to educate four lakh adults Thu, Apr 30, 2026, 11:32 AM
Vijay calls key meeting of TVK candidates ahead of TN election results Thu, Apr 30, 2026, 11:31 AM
Post exit polls: Cheers in UDF camp; ruling Left guarded, hoping against hope Thu, Apr 30, 2026, 11:28 AM