ఇంగ్లండ్ కీపర్‌ను బోల్తా కొట్టించాడుగా..రిషభ్ పంత్ నెక్స్ట్ లెవెల్ మైండ్‌గేమ్
 

by Suryaa Desk | Sun, Jun 22, 2025, 11:17 PM

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు.. టెస్ట్ మ్యాచ్‌లలో ఒక అద్భుతమైన నాయకత్వ ప్రతిభను కనబరుస్తోంది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ప్రశాంతంగా ఉంటే.. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం.. చాలా ఉత్సాహంగా, వికెట్ల వెనుక (కీపర్‌గా) నుంచి మాట్లాడుతూ, ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, వ్యూహాలతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. ఇటీవల సచిన్ తెండూల్కర్ ఇలాంటి ఒక సంఘటనను బయటపెట్టాడు. అయితే మరొకటి మాత్రం ఎవరి దృష్టిలో పడలేదు. లీడ్స్‌లో జరిగిన రెండో రోజు ఆటలో ఇది జరిగింది. ఈ రెండు సంఘటనలు కూడా ఇండియా మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. షోయబ్ బషీర్ ఓవర్లలోనే జరిగాయి.


భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో పంత్, గిల్ హిందీలో మాట్లాడుకున్నారని సచిన్ చెప్పాడు. పాకిస్తాన్ మూలాలున్న బౌలర్ బషీర్‌ను ఇబ్బంది పెట్టడానికి ఇలా చేశారని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత సెంచరీ కొట్టిన పంత్ వెంటనే .. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జామీ స్మిత్‌ను స్లెడ్లింగ్ చేశాడు. "మళ్ళీ, ఫీల్డర్లు అందరూ వెనక్కి వెళ్లిపోయారు" అని మాటలతో స్మిత్‌ను కంగారు పెట్టాడు.


మాటలతో కంగారు పెట్టి..


ఆ వెంటనే బషీర్ వేసిన బంతిని సిక్స్‌గా కొట్టాడు పంత్. అయితే, ఆ తర్వాత బంతికి పంత్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలమయ్యాడు. స్మిత్‌కు క్యాచ్ అందుకునే అవకాశం వచ్చింది. కానీ, అతను క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. దీంతో పంత్ 134 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్, గిల్ కూడా సెంచరీలు చేశారు. దీంతో ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది.


2019లో సిడ్నీలో జరిగిన న్యూఇయర్ టెస్ట్‌లో 622/7 చేసిన తర్వాత విదేశాల్లో అత్యధిక స్కోరు చేయడం ఇదే మొదటిసారి. అలాగే 2007 తర్వాత ఇంగ్లాండ్‌లో చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. అయితే, ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేసినా, మిగతా బ్యాట్స్‌మెన్ సరిగా ఆడకపోవడంతో ఇండియా తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. చివరి ఏడు వికెట్లు కేవలం 41 పరుగులకే కోల్పోయింది.


హెడింగ్లే వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఇమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ స్కోరు 359/3 రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఓ దశలో 430/3 తో నిలిచింది. కానీ చివరి 41 పరుగులు చేయడానికి 7 వికెట్లను కోల్పోయింది. రెండో రోజు గేమ్‌లో రిషభ్ పంత్ సెంచరీ నమోదు చేయగా.. మొదటి రోజు జైశ్వాల్, గిల్‌లు సెంచరీలు బాదారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. రెండో రోజు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఓలి పోప్ సెంచరీ బాదాడు. బెన్ డకెట్ (62) రాణించాడు. ప్రస్తుతం ఓలి పోప్, హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM