కేవలం ఓ కరక్కాయ ఉంటే చాలు, వారం రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది
 

by Suryaa Desk | Sat, Jun 21, 2025, 11:38 PM

ఆయుర్వేదం ప్రకారం కరక్కాయతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణశక్తిని పెంచుతాయి. అంతే కాదు. కఫం ఎక్కువగా ఉన్నప్పుడు కరక్కాయ తీసుకుంటే తగ్గిపోతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే..కేవలం ఈ రెండు సమస్యలకే కాదు. బరువు తగ్గడానికి కూడా కరక్కాయ చాలా బాగా పని చెబుతున్నారు వెయిట్ లాస్ ఎక్స్ పర్ట్. జస్ట్ కరక్కాయ ఉంటే చాలు. వారం రోజుల్లోనే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించుకోవచ్చని వివరించారు. అయితే వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రం ఆమె చెప్పిన విధంగా కరక్కాయను వాడాలి. మరి కరక్కాయతో బరువు ఎలా తగ్గుతారు. వెయిట్ లాస్ అయ్యే విధంగా కరక్కాయలో ఎలాంటి గుణాలున్నాయి. ఈ వివరాలు తెలుసుకుందాం.


కరక్కాయ


బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే..ఇప్పుడు వెయిట్ లాస్ కోచ్ సుమన్ చెప్పిన చిట్కా మాత్రం చాలా సింపుల్. కేవలం ఓ కరక్కాయ ఉంటే చాలు. 8 రోజులు లేదా అంత కన్నా ముందే కనీసం 3 కిలోల బరువు తగ్గచ్చు అని చెబుతున్నారు. కేవలం బరువు తగ్గడమే కాదు. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా ఇది ఎంతో బాగా పని చేస్తుందని వివరించారు. నిజానికి కరక్కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిపోతుంది. బాడీ చాలా తేలిగ్గా అనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్ ఫ్లమేషన్ తగ్గిపోయి కీళ్ల నొప్పుల ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. బరువు తగ్గడానికి కరక్కాయ ఎలా పని చేస్తుంది. దీన్ని ఎలా వాడాలో చూద్దాం.


ఎలా తయారు చేసుకోవాలి


బరువు తగ్గాలంటే కరక్కాయను టీ రూపంలో తీసుకోవాలి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో వెయిట్ లాస్ కోచ్ సుమన్ వివరించారు. అయితే..మామూలు కరక్కాయతో పాటు నల్ల కరక్కాయ కూడా వాడాలని చెప్పారు. ఓ కరక్కాయ, రెండు నల్ల కరక్కాయలు తీసుకుని ముందు పొడి చేసుకోవాలి. తరవాత ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో ఈ పౌడర్ అందులో కలపాలి. నీళ్ల రంగు మారేంత వరకూ అలాగే ఉంచాలి. కలర్ మారిన తరవాత ఈ నీళ్లను ఓ గ్లాస్ జార్ లేదా ప్లాస్క్ లోకి తీసుకోవాలి. ఆ తరవాత ఓ కప్పు వాటర్ తాగాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే కేవలం వారం రోజుల్లోనే తేడా తెలుస్తుందని వెయిట్ లాస్ ఎక్స్ పర్ట్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.


తయారు చేసుకునే విధానం


ఎప్పుడు తాగాలంటే


వారం రోజుల్లో బరువు తగ్గుతారు సరే. కానీ..ఈ డ్రింక్ ని ఎప్పుడు తాగాలనే కదా డౌట్. ఈ ప్రశ్నకు సుమన్ సమాధానం చెప్పారు. రోజూ రాత్రి పడుకునే ముందు కనీసం గంట లేదా రెండు గంటల ముందు ఈ డ్రింక్ తాగితే చాలా మంచిది. అంటే భోజనం చేసిన తరవాత తీసుకోవాలి. అయితే...భోజనం కూడా పడుకోడానికి రెండు గంటల ముందే పూర్తైపోవాలి. భోజనం చేసిన కాసేపటికి ఈ డ్రింక్ తీసుకుంటే సులువుగా జీర్ణం అవుతుంది. రాత్రంతా ఎలాంటి జీర్ణ సమస్యలు లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. ఇలా కనీసం 7 నుంచి 8 రోజుల పాటు తీసుకుంటే ఫలితాలు కనబడతాయి. అయితే..ఇప్పుడు చెప్పిన మోతాదులోనే కరక్కాయ తీసుకుంటే మంచిది. మరీ అతిగా వాడడం వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయి.


ఎన్నో లాభాలు


కరక్కాయ డీటాక్సిపై ఏజెంట్ లా పని చేస్తుంది. అంటే..శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపించేస్తుంది. ముఖ్యంగా పొట్ట, పెద్ద పేగులో ఉన్న మురికిని వదిలిస్తుంది. అంతే కాదు మలబద్ధకం సమస్యనూ పోగొడుతుంది. సులువుగా మలవిసర్జన జరిగేలా చూస్తుంది. ఇక వెయిట్ లాస్ విషయంలో ఇది ఎలా పని చేస్తుందో కూడా సుమన్ వివరించారు. జీర్ణ శక్తిని కరక్కాయ చాలా మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఎక్కువ మొత్తంలో పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. దీంతో పాటు మెటబాలిజం మెరుగుపడుతుంది. అనారోగ్యకరమైన ఆకలిని తగ్గించడంలో కరక్కాయ చాలా బాగా పని చేస్తుంది.


మరి కొన్ని ప్రయోజనాలు


మెటబాలిజం యాక్టివిటీని పెంచి కొవ్వుని చాలా త్వరగా కరిగించడంలో ఇదో మెడిసిన్ లా పని చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయి టాక్సిన్స్ అన్నీ బయటకు పంపుతుంది. వెయిట్ మేనేజ్ మెంట్ కీ తోడ్పడుతుంది. అన్నింటి కన్నా కీలకమైన విషయం ఏంటంటే..కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు. శరీరంలో ఎక్కువ మొత్తంలో నీరు నిలిచిపోకుండా తోడ్పడుతుంది. శరీరం ఎప్పుడూ తేలిగ్గా, చురుగ్గా ఉండేలా సాయపడుతుంది.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM