ప్రియుడితో హనీమూన్‌కు వెళ్లేందుకు ఆ ఇద్దరు పిల్లల తల్లి ఏం చేసిందంటే
 

by Suryaa Desk | Sat, Jun 21, 2025, 08:12 PM

రోజురోజుకూ మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. కాసేపటి కామ వాంఛ కోసం కన్నవాళ్లను, కట్టుకున్న వాళ్లనే చంపేస్తున్నారు చాలా మంది. అలా జీవితాలను నాశనం చేసుకుని.. చివరకు జైల్లో మగ్గిపోతున్నారు. అచ్చంగా ఇలాంటి పనే చేసిందో మహిళ. ముఖ్యంగా ప్రియుడితో కాసేపటి పడక సుఖం కోసం తన ఇద్దరు కన్నబిడ్డల ప్రాణాలనే తీసింది. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది. భర్త ఉద్యోగరీత్యా దూరంగా ఉండగా, ప్రియుడితో హనీమూన్‌కు వెళ్లాలనే మోజులో ఈ ఘాతుకానికి పాల్పడిన మహిళ చర్య దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన తల్లి ప్రేమ అనే పవిత్ర బంధానికే మాయని మచ్చ తెచ్చింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్‌లోని రోడ్కలి గ్రామంలో చోటు చేసుకుంది. ముఖ్యంగా గ్రామానికి చెందిన 24 ఏళ్ల ముస్కాన్ అనే మహిళకు చాలా ఏళ్ల క్రితమే వసీమ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అందులో కుమారుడు పెద్ద వాడు కాగా అతడి పేరు అర్హాన్. ప్రస్తుతం ఇతడికి ఐదేళ్లు. అలాగే తర్వాత పాప పుట్టగా ఆమెకు ఇనయ అని పేరు పెట్టారు. ఈమె వయసు కేవలం ఏడాది మాత్రమే. అయితే భర్త వసీమ్ ఉపాధి నిమిత్తం చండీగఢ్ వెళ్లి అక్కడే పనులు చేసుకుంటున్నాడు. నెల నెలా భార్యకు డబ్బులు పంపిస్తున్నాడు.


ఇదంతా బాగానే ఉండగా.. ముస్కాన్‌కు జునైద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భర్త దగ్గర లేకపోవడంతో.. ఆమె మనసు అతడిపైకి మళ్లింది. అతి కొద్ది రోజుల్లోనే అతడితో ప్రేమలో పడిపోయింది. జునైద్‌కు కూడా ముస్కాన్ బాగా నచ్చడంతో.. ఇద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారు. ముఖ్యంగా తరచుగా అతడు ఆమె ఇంటికి వస్తూ.. వ్యవహారం నడిపిస్తున్నాడు. అయితే ఆమె పిల్లలు కూడా ఆమెతోనే ఉంటుండగా వీరి బంధానికి అడ్డుగా మారారు. చిన్నారులు తరచుగా ఇంట్లోనే ఉండడంతో.. వారి కలయికకు భంగం వాటిల్లుతోంది. దీంతో జునైద్ పిల్లలను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.


ముఖ్యంగా తన ప్రియురాలు ముస్కాన్‌కు ఇదే విషయం చెప్పాడు. పిల్లలు లేకపోతే బాగా ఎంజాయ్ చేసేవాళ్లమని, వారిని చంపేసిన మనం ఎటైనా వెళ్లిపోదామంటూ వివరించాడు. ఇందుకు ఆమె కూడా ఓకే చెప్పింది. ముఖ్యంగా పిల్లల్ని చంపిన వెంటనే ఇద్దరూ కలిసి హనీమూన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం గురువారం రోజు హత్యకు పన్నాగం పన్నారు. ఇద్దరూ కలిసి అర్థరాత్రి పిల్లలకు ఊపిరాడకుండా చేసి చంపేశారు. కానీ ఆ తర్వాత తీవ్రంగా భయపడిపోయిన జునైద్ అక్కడి నుంచి పారిపోయాడు. మరోవైపు ముస్కాన్ కూడా మరింత భయపడిపోయింది. ఏం చేయాలో పాలుపోక అలాగే ఉండిపోయింది. అయితే పిల్లల మృతి విషయం తెలుసుకున్న స్థానికులు.. ఎలా చనిపోయారని ముస్కాన్‌ను ప్రశ్నించారు.


కానీ ఆమె సరైన సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉండడంతో.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా రంగంలోకి దిగిన పోలీసుల అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే ముస్కాన్‌ను విచారించగా.. భయపడిపోయిన ఆమె వెంటనే తన తప్పును ఒప్పుకుంది. ప్రియుడు జునైద్ సాయంతోనే అతడిని చంపినట్లు వివరించింది. దీంతో ఆమెను అదుపులోలి తీసుకున్న పోలీసులు ప్రియుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు పిల్లలను భార్యే చంపిందని తెలుసుకున్న ఆమె భ్రత వసీం కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఆమె వెళ్లిపోతే వెళ్లిపోయుండాల్సింది కానీ పిల్లల్ని చంపి తనని ఒంటరి వాడిని చేసిందంటూ కుమిలిపోయాడు. ఆయన ఏడ్చిన తీరు చూసిన స్థానికులు కూడా కంటతడి పెట్టారు.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM