రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ
 

by Suryaa Desk | Sat, Jun 21, 2025, 07:33 PM

చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్ రైతుల సమస్యలపై తక్షణం స్పందించి, గిట్టుబాటు ధర కల్పించేవారని గుర్తుచేశారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని, వీధుల్లోనే గంజాయి అమ్ముతున్నారని సజ్జల ఆరోపించారు. వైసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసులు వేధిస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన తప్పులను ఇతరులపై, ముఖ్యంగా జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, వీటిపై ప్రజల పక్షాన వైసీపీ నిరంతరం ప్రశ్నిస్తూనే, పోరాడుతూనే ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. కేవలం మీడియా హైప్‌తోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM