బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత.. పోతే ఎంత,,,, యాంకర్ శ్యామల
 

by Suryaa Desk | Sat, Jun 21, 2025, 07:27 PM

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత.. పోతే ఎంత అంటూ యాంకర్ శ్యామల బాలకృష్ణపై విమర్శలు గుప్పించారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేటని యాంకర్ శ్యామల ప్రశ్నించారు. హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ గెలిచిన విధానం చేస్తే.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఎలా గెలిచిందో అర్థమవుతుందంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


"వరుసగా మూడుసార్లు గెలిచానని చెప్పుకునే నందమూరి బాలకృష్ణ గారు.. ఈ నియోజకవర్గ ప్రజలకు ఎన్నిసార్లు కనిపిస్తారు. ఒకటీ రెండు సార్లు తప్ప. అది కూడా ఏదో మీటింగ్ ఉంటే రావటం.. కాసేపు ముఖం చూపించి వెళ్లిపోవటం అంతే. ఇక్కడ జరుగుతున్న సమస్యలు ఆయనకు ఏం తెలుసు? దాని మీద ఆయన ఏం బాధ్యత వహిస్తారు? ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హిందూపూర్. ఇది బోర్డు మాత్రమే కనిపిస్తుంది. ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉంటే ఎంత? పోతే ఎంత? ఎన్నికల్లో ఇన్ని స్థానాల్లో గెలిచాం, అన్ని స్థానాల్లో గెలిచామని చెప్పుకుంటున్నారు. కానీ ఎన్నికల్లో వారు ఎలా గెలిచారో హిందూపురం నియోజకవర్గమే అందరికీ తెలియజేస్తుంది. ఒక్క బూత్‌లో ఒక్క ఓటు. ఇలాంటిది ఎప్పుడైనా కనీవిని ఎరిగామా? దీనిని బట్టి అర్థమవుతోంది.. వారిది ఎలాంటి గెలుపో.. పవన్ కళ్యాణ్.. ఇంకో నాయకుడు. ఈయన ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి " అంటూ యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు చేశారు.


మరోవైపు హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు.


రాయలసీమ మొత్తంలో టీడీపీ మూడు స్థానాలు గెలుచుకుంటే.. అందులో బాలకృష్ణ కూడా ఉండటం విశేషం. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే అప్పట్లో విజయం సాధించారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో మరోసారి హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ.. మూడోసారి కూడా ఘన విజయం సాధించారు.

Latest News
SAFF Women's Championship : Hosts India grouped with Bangladesh and Maldives Wed, Apr 22, 2026, 02:44 PM
Will continue to strengthen cooperation with India in confronting terrorism: Israeli FM on Pahalgam attack anniversary Wed, Apr 22, 2026, 02:00 PM
Bombay HC quashes charges against four accused in 2006 Malegaon blast case Wed, Apr 22, 2026, 01:33 PM
Delhi HC judge recuses from hearing PIL seeking action against Kejriwal, AAP leaders over recording, circulation of court proceedings Wed, Apr 22, 2026, 01:27 PM
Delhi court extends CBI custody of Mudavath Devula, Bharat Mathur by 2 days in bribery case Wed, Apr 22, 2026, 01:20 PM