|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 03:49 PM
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో దారుణ హత్యాకాండ జరిగింది. భర్త రిషి యాదవ్‌ను అతని భార్య లలిత తన ప్రియుడు, మరిది అయిన నీరజ్‌తో కలిసి కాల్చి చంపింది. రిషి ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఎక్కువ సమయం ఇంటి నుంచి దూరంగా గడిపేవాడు. ఈ సమయంలో లలిత తన మరిది నీరజ్‌తో సంబంధం పెట్టుకుంది.
వీరి వివాహేతర సంబంధానికి రిషి అడ్డుగా ఉన్నాడని భావించిన లలిత, నీరజ్‌తో కలిసి అతన్ని అంతమొందించాలని కుట్ర పన్నారు. ఇద్దరూ కలిసి నాటు తుపాకీతో రిషిని కాల్చి హత్య చేశారు. ఈ ఘటన నంగ్లా హిమాచల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో లలిత నీరజ్‌తో కలిసి హత్యకు పాల్పడినట్లు అంగీకరించింది. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, హత్యకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.