|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 03:37 PM
ఇంటర్నేషనల్ యోగా డే పలు జాతులు, సంస్కృతులు, నమ్మకాలే లక్ష్యంగా ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాకుండా.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచే పూర్తి జీవన విధానం. ఒత్తిడి తగ్గించి, సమతుల్యతను తెచ్చే యోగా ప్రయోజనాలను వివరించడం దీని లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా యోగా అవగాహన పెరుగుతోంది.అంతర్జాతీయ యోగా దినోత్సవం 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనతో మొదలైంది. ఐక్యరాష్ట్ర సమితి డిసెంబర్ 11, 2014న జూన్ 21ని యోగా దినంగా ప్రకటించింది. మొదటి యోగా దినం 2015లో జరిగింది. ఢిల్లీలో 35,000 మంది రాజ్‌పథ్‌లో యోగా చేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. జూన్ 21ని ఎంచుకోవడానికి కారణం.. ఇది ఉత్తరార్ధ గోళంలో అతి పొడవైన రోజు (వేసవి అయనాంతం) కావడం, భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉండటం.
Latest News