|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 12:24 PM
ఢిల్లీ నుంచి పుణెకి వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనతో విమానంలో సాంకేతిక తనిఖీలు చేయాలని నిర్ణయించి ప్రయాణాన్ని వాయిదా వేసారు. పుణె విమానాశ్రయానికి సురక్షితంగా చేరిన తర్వాత పక్షి ఢీకొన్న విషయం అధికారికంగా నిర్ధారించారు. ఎయిరిండియా ప్రయాణికులకు టికెట్లను రద్దు చేసి, వారిని మరో విమానంలో దిల్లీకి పంపించిందని ప్రకటించింది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.
Latest News