ఈ కారణాల వల్లే కిడ్నీలు ఫెయిల్,,,,, నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదమే
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 09:59 PM

​కిడ్నీలు రెస్ట్ లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలో ఎక్కువగా ఉండే నీటిని, ట్యాక్సిన్స్‌ని వడకట్టి రోజులో దాదాపు 200 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయని చెబుతారు. మూత్రపిండాలు రెండు చిక్కుడు గింజ ఆకారంలో ఉండే అవయవాలు. ఒక్కొక్కటి పిడికిలి ఆకారంలో ఉంటాయి. అవి పక్కటెముక క్రింద, వెన్నెముకకి ప్రతివైపు ఒకటి చొప్పున ఉంటాయి. హెల్దీ కిడ్నీలు ప్రతి నిమిషం అరకప్పు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. వ్యర్థాలను, మూత్రాన్ని తయారుచేయడానికి అదనపు నీటిని తొలగిస్తాయి. ఇన్ని పనులు చేసే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరికొన్ని ఫుడ్స్ తీసుకోవాలి.


పెయిన్ కిల్లర్స్ వాడడం


ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం కూడా మంచిది కాదు. అవి మూత్రపిండాలకు కూడా హానికి కలిగిస్తాయి. ముఖ్యంగా మీకు ఇప్పటికే కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ వాడకాన్ని తగ్గించండి. ఇవి ఎప్పుడు కూడా మోతాదుని మించి వాడొద్దు. ఈ మెడిసిన్ విషయంలో జాగ్రత్త పడాలి.


ఉప్పు


ఉప్పు, సోడియం ఎక్కువగా ఉన్న ఫుడ్ బీపిని పెంచుతుంది. దీని వల్ల కిడ్నీలకు హాని కలిగిస్తుంది. ఉప్పు బదులుగా మూలికలు, సుగంధద్రవ్యాలతో ఆహారాన్ని రుచి చూడండి. ఇవి కూడా అంతే రుచిగా ఉంటుంది. మీ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేస్తాయి. మీ డైట్‌లో తక్కువ ఉప్పు వాడాలి.


ప్రాసెస్ ఫుడ్


ఓ అధ్యయనం ప్రకారం ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువగా తినేవారికి మూత్రపిండాల వ్యాధి ప్రమాదం 24 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఈ ఫుడ్స్ ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. ఇందులో యాడెడ్ షుగర్, ఆర్టిఫీషియల్ అడిటివ్స్, రిఫైండ్ కార్బ్స్, అన్‌హెల్దీ ఫ్యాట్స్, సోడియంతో నిండి ఉంటాయి. కానీ, ఫైబర్, ప్రోటీన్, అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యాల వంటి ఆహారాలు తీసుకోవాలి. ఆహారాన్ని మార్చే ముందు హెల్త్‌కేర్ ప్రొవైడర్‌తో మాట్లాడాలి.


తగినంత నీరు తాగకపోవడం


తగినంత నీరు తాగకపోవడం మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మీరు కష్టపడి పనిచేస్తున్నప్పుడు, వేడివాతావరణంలో ఉంటే నీరు మూత్రపిండాల వ్యర్థాలను తొలగించడంలో సాయపడుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లని తగ్గించడంలో కూడా సాయపడుతుంది.


నిద్రలేకపోవడం


మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం. మూత్రపిండాల పనితీరు నిద్ర మేల్కొలుపు చక్రం ద్వారా నియంత్రించబడుతుంది. ఇది 24 గంటల పాటు మూత్రపిండాల పనిభారాన్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వీటితో పాటు వర్కౌట్ చేయకపోవడం వల్ల సమస్య చాలా వరకూ పెరుగుతుంది.


ఎక్కువగా మాంసం తినడం


ప్రోటీన్ మన డైట్‌లో ఓ ముఖ్య భాగం. ఇది కండరాలను నిర్మించడానికి, నయం చేయడానికి, ఇన్ఫెక్షన్స్‌తో పోరాడేందుకు, ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మనకి అవసరమైన ప్రోటీన్ మొత్తం మన వయసు, లింగం, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మీట్, మిల్క్ ప్రోడక్ట్స్, గుడ్ల వంటి జంతు ప్రోటీన్లలో అన్ని అవసరమైన బిల్డింగ్ బ్లాక్‌లో ఉంటాయి. కానీ, కొన్ని అన్‌హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. చేపలు, పౌల్ట్రీ, లో ఫ్యాట్ మిల్క్ ప్రోడక్ట్స్‌లో కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. అయితే, కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే, మీ శరీరం అన్ని ప్రోటీన్ వ్యర్థాలను తగ్గించడానికి కష్టపడొచ్చు.


ఎక్కువగా షుగర్ తీసుకోవడం


షుగర్ కారణంగా అధిక బరువు, హైబీపి, షుగర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి కిడ్నీల సమస్యలకి ప్రధాన కారణాలు. డెజర్ట్స్, డ్రింక్స్ వంటి వాటిలో షుగర్ ఉంటుంది. అందుకోసం ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వంటివల్ల సమస్య పెరుగుతుంది. స్మోకింగ్ కారణంగా కూడా సమస్య ఉంటుంది. ​గమనిక :ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి సమయం తెలుగు బాధ్యత వహించదు.​​

Latest News
Artemis II crew returns after historic moon mission Sat, Apr 11, 2026, 12:04 PM
Tamil Nadu Assembly elections: 4,023 candidates in fray after scrutiny, withdrawals Sat, Apr 11, 2026, 11:59 AM
Bengal LoP draws attention of ECI over contractual staff appointment as sector officers Sat, Apr 11, 2026, 11:58 AM
ED raids former education minister Partha Chatterjee's residence ahead of Bengal polls Sat, Apr 11, 2026, 11:57 AM
US, Iran head to high-stakes Islamabad talks Sat, Apr 11, 2026, 11:57 AM