ఎయిరిండియా బుకింగ్స్ డౌన్.. తగ్గిన ధరలు
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:21 PM

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా విమాన బుకింగ్‌లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ప్రమాదం కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ల బుకింగ్స్ 20 శాతం వరకు తగ్గాయి. టికెట్ ధరలు కూడా 8 నుంచి 15 శాతం వరకు తగ్గాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) ప్రెసిడెంట్ రవి గోసైన్ తెలిపారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించలేదు. అహ్మదాబాద్‌లో 242 మంది ప్రయాణికులతో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా AI-171 విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మినహా మిగిలిన ప్రయాణికులందరూ మరణించారు.


ఈ ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా బుకింగ్స్ బాగా తగ్గాయని రవి గోసైన్ చెప్పారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన మార్గాల్లో బుకింగ్స్ ఎక్కువగా తగ్గాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ రూట్లలో 18 నుంచి 22 శాతం వరకు, దేశీయ రూట్లలో 10 నుంచి 12 శాతం వరకు బుకింగ్స్ తగ్గాయని అంచనా వేశారు.


ఎయిర్ ఇండియా విమాన టికెట్ల ధరలు కూడా తగ్గాయి. దేశీయ విమాన మార్గాల్లో 8 నుంచి 12 శాతం వరకు, అంతర్జాతీయ విమాన మార్గాల్లో 10 నుంచి 15 శాతం వరకు టికెట్ ధరలు తగ్గాయని రవి తెలిపారు. ముఖ్యంగా యూరప్, ఆగ్నేసియా మార్గాల్లో టికెట్ల ధరలు బాగా తగ్గాయని ఆయన చెప్పారు. డిమాండ్ తక్కువగా ఉండటం, ప్రమోషన్ల వల్ల కూడా టికెట్ల ధరలు తగ్గాయని విశ్లేషించారు.


టూర్ ఆపరేటర్ల ద్వారా ఎయిర్ ఇండియా విమానాలకు టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా వాటిని రద్దు చేసుకుంటున్నారని గోసైన్ తెలిపారు. పెద్ద కంపెనీలకు చెందిన ఉద్యోగులు, ఎక్కువ డబ్బులున్న ప్రయాణికులు వేరే విమానాల్లో వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారని.. అంతర్జాతీయ మార్గాల్లో టికెట్ల రద్దు 15 నుంచి 18 శాతంగా ఉండగా, దేశీయ మార్గాల్లో ఇది 8 నుంచి 10 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, త్వరలోనే బుకింగ్స్ పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా కూడా ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్‌లు 20 శాతం వరకు తగ్గాయని చెప్పారు. అంటే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఆ సంస్థకు చాలా నష్టం కలిగించిందని అర్థం చేసుకోవచ్చు.

Latest News
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM
EAM Jaishankar meets Mauritius President, discusses ways to bolster bilateral ties Fri, Apr 10, 2026, 04:36 PM
EAM Jaishankar, Seychelles counterpart Faure hold talks in Mauritius Fri, Apr 10, 2026, 04:33 PM