కవర్ డ్రైవ్‌లతో మెరిసిన కేఎల్ రాహుల్,,,హాఫ్ సెంచరీ మిస్
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:05 PM

టెండూల్కర్ - అండర్సన్ ట్రోఫీ మొదటి టెస్టులో టీమిండియా శుభారంభం చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. భారత జట్టు బ్యాటింగ్‌కి వచ్చింది. టెస్టుల్లో ముఖ్యంగా విదేశీ పిచ్‌లలో టీమిండియా పట్టుమని పది పరుగులు చేయకముందే ఫస్ట్ వికెట్ కోల్పోతుంది. కానీ ఇంగ్లండ్‌‌పై ఇండియా డ్రీమ్ ఓపెనింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ , కేఎల్ రాహుల్ అద్భుత శుభారంభం అందించారు.


టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోకుండా 25 ఓవర్లు క్రీజులో నిలబడ్డారు. కేఎల్ రాహుల్ కవర్ డ్రైవ్స్‌తో తన క్లాస్‌ను చూయించాడు. హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్న సమయంలో కవర్ డ్రైవ్‌కి ప్రయత్నించి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వికెట్ కోల్పోయిన తర్వాత కేఎల్ రాహుల్ చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. 78 బంతులు ఆడిన కేఎల్ 8 ఫోర్లతో 42 పరుగులు చేసి అవుటయ్యాడు.


ఇటీవల కాలంలో టీమిండియా ఓపెనింగ్ బెస్ట్ ఇదే అని చెప్పొచ్చు. 25 ఓవర్ల పాటు వికెట్ పడకుండా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే లంచ్ బ్రేక్‌కి ముందు కేఎల్ రాహుల్ అవుట్ కాగా.. ఆ వెంటనే డెబ్యూ బ్యాటర్ సాయి సుదర్శన్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. దాంతో టీమిండియా 92 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.


కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ కంటే ముందుగానే లండన్ చేరుకున్నాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్ కావడంతో జట్టులో సీనియర్ బ్యాటర్ రాహుల్ కావడంతో.. జట్టు బాధ్యత అతని మీదే పడింది. దాంతో ఈ సిరీస్‌లో ఎలాగైనా రాణించాలని నెట్స్‌లో కూడా శ్రమటోడ్చాడు. ఇప్పటి వరకు 59 టెస్టులు ఆడిన రాహుల్ 8 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో 3299 పరుగులు చేశాడు.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM