|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 06:13 PM
ఇజ్రాయెల్‌పై ఇరాన్ నిన్న క్లస్టర్ బాంబులతో దాడి చేసిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇరాన్ క్లస్టర్ బాంబులతో తమపై దాడిచేసిందని ఇజ్రాయెల్ కూడా ఆరోపించింది. దాడుల్లో భాగంగా ఇరాన్ ప్రయోగించిన ఒక క్షిపణిలో క్లస్టర్ బాంబు వార్‌హెడ్ ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ధ్రువీకరించింది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటువంటి ఆయుధాలను ఉపయోగించడం ఇదే మొదటిసారని నివేదికలు తెలుపుతున్నాయి. క్లస్టర్ బాంబు అనేది ఒక విస్తారమైన ప్రాంతంలో అనేక చిన్న బాంబులను (వీటిని ‘సబ్‌మ్యునిషన్స్’ లేదా ఉప ఆయుధాలు అని కూడా అంటారు) విడుదల చేయడానికి రూపొందించిన ఆయుధం. ఇది ఒకే పెద్ద పేలుడుకు బదులుగా, గాలిలోనే ఎక్కువ ఎత్తులో తెరుచుకుని, లక్షిత ప్రదేశం అంతటా అనేక చిన్న పేలుడు పదార్థాలను వెదజల్లుతుంది.ఇరాన్ దాడిలో క్షిపణి వార్‌హెడ్ భూమికి సుమారు ఏడు కిలోమీటర్ల ఎత్తులో పేలిందని, దీనివల్ల మధ్య ఇజ్రాయెల్‌లో ఎనిమిది కిలోమీటర్ల వ్యాసార్థంలో దాదాపు 20 సబ్‌మ్యునిషన్స్ చెల్లాచెదురుగా పడ్డాయని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. ఈ సబ్‌మ్యునిషన్స్‌కు నిర్దేశిత లక్ష్యం ఉండదు, అవి స్వయంగా కదలలేవు. అవి కేవలం భూమిపై పడి, తాకిన వెంటనే పేలేలా రూపొందిస్తారు.
Latest News