|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 05:50 PM
మద్యం కుంభకోణంపై జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మద్యం వ్యాపారంలో ఒక్క పైసా కూడా తినలేదని జగన్ దేవుడి మీద ప్రమాణం చేయాలి. ఇదే నా సవాల్. గతంలో వివేకా హత్య కేసులో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తానని, మీరు కూడా రావాలని అలిపిరిలో సవాలు విసిరితే జగన్ పారిపోయారు" అని గుర్తుచేశారు. చంద్రబాబు నిజంగా కక్ష సాధించాలనుకుంటే రెండు నిమిషాలు పట్టదని, కానీ తాము విధానాల ప్రకారమే వెళ్తామని, ప్రజలు తమను గెలిపించింది పరిపాలించడానికి, సంక్షేమం, అభివృద్ధి చేయడానికి తప్పితే కక్షసాధింపులతో ఎవరినో జైల్లో పెట్టడానికి కాదని స్పష్టం చేశారు. అయితే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, సాక్ష్యాధారాల ప్రకారమే ముందుకు వెళ్తామని హెచ్చరించారు. మద్యం కేసులో త్వరలో చార్జిషీట్ దాఖలు చేస్తారని, మనీలాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొనడం జగన్ ప్రభుత్వ హయాంలోని వ్యవహారాలపై దర్యాప్తు ముమ్మరం కానుందనడానికి సంకేతంగా కనిపిస్తోంది.
Latest News