|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 05:05 PM
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం అంటే జూన్ 19వ తేదీన హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సమయంలో నగదు, ఇతర వస్తువులతో పాటు 1.39.6 క్యారెట్ల ముడి వజ్రం కనిపించింది. వజ్రంతో పాటు.. దాని టెస్టింగ్ కార్డు, అది వేసిన భక్తుడు రాసిన లేఖ కూడా లభ్యమయ్యాయి. ఈ లేఖలో.. ఆలయ కమిటీవారికి నమస్కారం. మరియు ఒక చిన్న విన్నపం. ఇందులో ఉన్నది నిజమైన ముడి వజ్రం. ఇది నాకు దొరికింది. దీన్ని అమ్మలేక, భరించలేక.. భగవంతునికి సమర్పిస్తున్నాను. దీన్ని వస్తువుగా తయారు చేసి ఇచ్చే శక్తిలేక ఇలాగే ఇస్తున్నాను. దీన్ని ఏదో విధంగా.. దేవునికి ఉపయోగపడేలా చూడాలని ఆశిస్తున్నాను. అంటూ ఆ అజ్ఞాత భక్తుడు రాసుకొచ్చాడు.
Latest News