|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 12:03 PM
పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శిలావిగ్రహానికి పంచామృత అభిషేకం చేసి పుష్పాలతో అలంకరించారు. అనంతరం మామిడి పండ్లతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. మంగళహారతి నివేదించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
Latest News