|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 08:14 PM
ఆంధ్రప్రదేశ్ లా సెట్ ఫలితాలు 2025ను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉత్తమ ప్రతిభ కనభరిచారు. మొత్తం 95 మార్కులు సాధించి 739వ ర్యాంకు సాధించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే మంచి మార్కులు సాధించడంతో ఆమెను పలువురు అభినందిస్తున్నారు. కాగా ఆమె తండ్రి తంగిరాల ప్రభాకర్ రావు ఆకస్మిక మరణంతో సౌమ్య రాజకీయాల్లోకి వచ్చారు.
Latest News