|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 05:53 PM
చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర అసహనం ఉందని, ఆయనపై విరక్తితో టీడీపీ శ్రేణులు తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపుతూ వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుంతాం.. అని పుష్ప సినిమా డైలాగులు, పుష్పా సీన్లు, తగ్గేదేలే పుష్పా అని మేనరిజరం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు?.. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? అని నిలదీశారు. పల్నాడులో పుష్ప ఫ్లకార్డు పట్టుకున్న యువకుడు గతంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడని, చంద్రబాబు పాలనపై విరక్తితో టీడీపీ శ్రేణులు.. ఇలా తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారేమోనని అని వైయస్ జగన్ అభిప్రాయపడ్డారు.
Latest News