|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 05:45 PM
పల్నాడులో మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పర్యటనకు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ప్రజలు వాటిని అధిగమించి ప్రభంజనంలా జగన్ వెంట నిలిచారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...... పోలీసులను ఉపయోగించి అనుమతులను నిరాకరించడం, జనం రాకుండా బారికెట్లను అడ్డుపెట్టి దౌర్జన్యం చేయించినా సరే జగన్ కోసం జనం పోటెత్తారని అన్నారు. కూటమి ఏడాది దుష్ట పాలనకు ఇవి ప్రజల నుంచి వస్తున్న హెచ్చరికలని గుర్తుచేశారు. జనం నుంచి వచ్చిన నాయకుడిని అధికారంతో అణిచివేయాలనుకోవడం చంద్రబాబు అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News