|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 04:30 PM
ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరింత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.