|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 04:22 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపులో పాల్గొనదని, కానీ తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, న్యాయానికి పెద్ద పీట వేస్తామని, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కక్షతో చర్యలు తీసుకునే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.
అమరావతి అభివృద్ధిపై కేంద్రం పాజిటివ్ వైఖరి చూపిస్తోందని లోకేష్ తెలిపారు. అమరావతిని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కేంద్ర మంత్రులు ఆసక్తి వ్యక్తం చేశారని, రాష్ట్రానికి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం తోడుగా నిలుస్తుందని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన భేటీ జీవితంలో మలుపుతిరిగే సంఘటనగా మారిందని లోకేష్ అన్నారు. మోదీ తనకు చాలా సమయం కేటాయించి, భవిష్యత్తు పురోగతికి అవసరమైన అనేక సలహాలు ఇచ్చారని వెల్లడించారు. ప్రధాని వ్యక్తిత్వం, నాయకత్వం తనకు గొప్ప ప్రేరణగా నిలిచిందని ఆయన చెప్పారు.