ఎయిరిండియా ఓ కీలక నిర్ణయం..
 

by Suryaa Desk | Thu, Jun 19, 2025, 01:20 PM

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అనంతరం ఎయిరిండియా నిత్యం వార్తలో నిలుస్తోన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా ఎయిరిండియా ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. వైడ్-బాడీ విమానాలపై అంతర్జాతీయ సేవలను 15% తగ్గించనుందది. ఈ మేరకు సౌరభ్ సిన్హా నివేదించారు. అవును... ఎయిరిండియా వైడ్ బాడీ విమానాలపై అంతర్జాతీయ సేవలను 15% తగ్గించనుందని.. ఇది జూలై మధ్య కాలం వరకూ తక్షణమే అమలులోకి వస్తుందని సౌరభ్ సిన్హా నివేదించారు. వైడ్‌ బాడీ బోయింగ్‌ విమానాల్లో మరింతగా రక్షణ తనిఖీలు చేపట్టనున్నామని.. అదనపు జాగ్రత్తల కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ తగ్గింపు కారణంగా ఎఫెక్ట్ అవుతున్న ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణలు చెబుతోంది. ఈ సందర్భంగా.. ప్రయాణికులు ఎలాంటి ఖర్చు లేకుండా వారి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకునే లేదా డబ్బులు వాపస్ తీసుకునే అవకాశాన్ని కూడా అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త షెడ్యూల్ జూన్ 20 - 2025 నుంచి అమల్లోకి రానుందని వివరించింది! ప్రధానంగా కార్యాచరణ స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ఇది జరుగుతుందని.. ప్రయాణికులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారతదేశ మద్దతుతో తాము ఆ విషాద సంఘటన నుంచి మరింత బలంగా బయటపడతామని.. ప్రయాణికులకు తమ సేవల్లో విశ్వాసాన్ని తిరిగి స్థాపించగలమని పేర్కొంది. కాగా... ఇటీవల ఎయిరిండియా బోయింగ్ 787-8/9 విమానాలలో మెరుగైన భద్రతా తనిఖీని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 33 విమానాలలోనూ ఇప్పటికే 26 విమానాల తనిఖీలు పూర్తయ్యాయని ఎయిరిండియా తెలిపింది. మిగిలినవి త్వరలో పూర్తవుతాయని వెల్లడించింది.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM