|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 11:06 AM
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాల న పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. అటు జగన్ సైతం టీడీపీ ని టార్గెట్ చేస్తూ తన రాజకీయ కార్యాచరణకు పదును పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయిన జగన్ కు ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా జన స్పందన భారీగా కనిపిస్తోంది. ఏడాది కాలంలో కనిపిస్తున్న ఈ మార్పు రాజకీయంగా సంచలనంగా మారుతోంది. అసలు జగన్ క్రేజ్ పెంచుతోందెవరు.. ఎందుకు ఇంత జన స్పందన అనేది కీలకంగా మారింది. మారుతున్న లెక్కలు 2024 ఎన్నికల్లో జగన్ కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. కూటమి భారీ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. ఏడాది కాలం మాత్రమే పూర్తయింది. జగన్ కు వచ్చిన ఓటమితో ఇప్పట్లో వైసీపీ కోలుకోదనే చర్చ జరిగింది. పలువురు కీలక నేతలు పార్టీ వీడారు. జగన్ సైతం అప్పుడప్పుడు పరామర్శలు..తాడేపల్లి - బెంగళూరు మధ్య తిరుగుతూ.. ట్వీట్లతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే, ఊహించని విధంగా రాజకీయం టర్న్ అయింది. వరుస కేసులు.. అరెస్టుల పైన వైసీపీలో తొలుత ఆందోళన కనిపించినా.. తరువాత తెగింపు కనిపిస్తోంది. ఒక విధంగా వైసీపీలో ఉంటూనే.. జగన్ పైన ఆగ్రహంతో ఉంటూ.. పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్న వారంతా ఈ పరిణామాలతో ఏకం అయ్యారు. పార్టీకి తిరిగి దగ్గరయ్యారు. జన స్పందనతో ఇక.. జగన్ కు 2024 ఎన్నికల్లో 40 శాతం ఓటింగ్ దక్కింది. జగన్ పథకాల కారణంగా ఆ మాత్రం ఓటింగ్ దక్కిందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో.. తాము పథకాలు అమలు చేయటం ద్వారా జగన్ ఓట్ బ్యాంక్ ను తమ వైపు తిప్పుకోవాలని కూటమి నేతలు వ్యూహ రచన చేసారు. ఏడాది కాలంలో వైసీపీ ఈ పథకాల అమలు విషయంలోనే కూటమిని టార్గెట్ చేస్తుంది. తాజాగా తల్లికి వందనం పథకం అమలు చేసింది. అయితే, జగన్ ఓడిన తరువాత ఏ ప్రాంతానికి వెళ్లినా స్పందన అనూ గా కనిపిస్తోంది. పార్టీ నేతలు జనాన్ని తరలిస్తున్నారనేది కూటమి నేతల ఆరోపణ. అయితే, తరలి వచ్చిన జనం.. తరలించిన జనానికి తేడా స్పష్టంగా ఉందని.. అది జగన్ పర్యటనల్లో కనిపిస్తుంది అనేది మరో విశ్లేషణ. ఇదే సమయంలో జగన్ కు 2014 ఎన్నికల నాటి నుంచి 40 శాతం ఓట్ బ్యాంక్ ఉందని.. 2019 లో పెరిగి.. 2024 లో తగ్గినా 40 శాతం వచ్చిందని గుర్తు చేస్తున్నారు. క్రేజ్ పెంచుతోందెవరు జగన్ ఓడినా టీడీపీ నేతలు.. టీడీపీ మద్దతు మీడియా ప్రతీ సందర్భంలోనూ టార్గెట్ చేస్తూ కొనసాగి స్తున్న వ్యతిరేక ప్రచారం మాజీ సీఎం పైన సానుభూత పెంచుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ పర్యటనల పైన శాంతి భద్రతల కోణంలో పోలీసులు ఆంక్షలు విధించినా.. జగన్ అభిమాను లు దీనిని రాజకీయ కోణంలోనే ఆలోచన చేసారు. జగన్ టూర్ సక్సెస్ చేసి తమకు సత్తా చాటాలని భావించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జగన్ కు ఒక్క సీటు దక్కలేదు. అయినా.. జగన్ పర్యటనకు భారీగా స్పందన కనిపించింది. ఇక కొత్తగా జగన్ కమ్మ వారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించటం ఆసక్తి కరంగా మారింది. జగన్ సైతం ఇక ఛేజింగ్ మొదలు పెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, రానున్న రోజుల్లో కూటమి వర్సస్ జగన్ రాజకీయ గేమ్ మరింత ఆసక్తి కరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.
Latest News