చర్మంపై మురికిని తొలగించి ముఖంలో గ్లో పెంచే డిటాక్స్ డ్రింక్
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:18 PM

సాధారణంగా డిటాక్స్ అంటే కేవలం లివర్, కిడ్నీలు లేదా పొట్ట అనే అనుకుంటాం. కానీ..చర్మానికి కూడా డిటాక్స్ అవసరమే. ఎక్కువగా దుమ్ము, ధూళి పేరుకుపోయేది చర్మంపైనే. రోజూ స్నానం చేసినప్పటికీ దాని వల్ల పూర్తిగా స్కిన్ లో ఉండే మురికి అంతా వదిలిపోదు. లోపల బ్యాక్టీరియా అలాగే ఉంటుంది. ఎప్పుడో అప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది. ఈ కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ముఖంపైనే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. దద్దుర్లు, యాక్నీ, జిడ్డుదనం లాంటివి ఇబ్బంది పెడతాయి. ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే స్కిన్ డిటాక్స్ తప్పనిసరిగా చేసుకోవాలి. దీని కోసం రకరకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండొచ్చు. కానీ..సహజంగానే చర్మంలోని మురికిని వదిలించుకునే చిట్కా చెప్పారు న్యూట్రిషనిస్ట్. దీన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలో చూద్దాం.


స్కిన్ డిటాక్స్ 


చర్మంపైన రకరకాల బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. సబ్బుతో స్నానం చేసినప్పుడు పైపైన దుమ్ము మాత్రమే తొలగిపోతుంది. మరి చర్మ కణాల్లో దాక్కుని ఉన్న మురికి సంగతేంటి. దాన్నీ వదిలించుకోవాలిగా. అలా చేయాలంటే ఎన్నో పద్ధతులున్నాయి. కానీ..న్యూట్రిషనిస్ట్ మాత్రం ఓ నేచురల్ ప్రాసెస్ చెప్పారు. మరీ ఎక్కువగా ఖర్చు పెట్టకుండా చాలా సింపుల్ గా ఓ డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవచ్చని వివరించారు. పైగా ఈ డ్రింక్ తయారీ చాలా సులభం కూడా. మరి ఈ డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోడానికి ఏయే పదార్థాలు కావాలి. వేటిని ఎంత మోతాదులో తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


ఈ స్కిన్ డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోడానికి కేవలం రెండంటే రెండు పదార్థాలు సరిపోతాయి. రోజా పూల రెక్కలు, దాల్చిన చెక్క. ఇవి ఉంటే చాలు. చర్మంలోపల పేరుకుపోయిన మురికి అంతా వదిలిపోతుంది. చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాదు. అప్పటి వరకూ ముడతలు పడి, రంగు తగ్గిపోయి ఉన్న స్కిన్ మెరిసిపోతుంది. రోజా పూలల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల చర్మంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఇక దాల్చిన చెక్క కూడా చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో తోడ్పడుతుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఆ ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.


ఎంత తీసుకోవాలి


ఈ డ్రింక్ తయారు చేసుకోవాలంటే ముందుగా ఓ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ తీసుకోవాలి. అయితే..వీటిని ముందుగా ఎండబెట్టాలి. డ్రై పెటల్స్ మాత్రమే వాడాలి. ఆ తరవాత ఓ దాల్చిన చెక్క తీసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి తాగేందుకు ఒకటిన్నర కప్పు వేడి నీళ్లు అవసరం అవుతాయి. సరిగ్గా ఇప్పుడు చెప్పిన మోతాదులో తీసుకుంటే పర్ ఫెక్ట్ డ్రింక్ తయారవుతుంది. ఇప్పుడు చెప్పిన రీతిలో వీటిని కలుపుకుంటే కొద్ది నిముషాల్లోనే డిటాక్స్ డ్రింక్ రెడీ అయిపోతుంది. తయారు చేసే విధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎలా తయారు చేసుకోవాలి


ముందుగా ఒకటిన్నర కప్పు నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. ఆ తరవాత అందులో రోజ్ పెటల్స్ వేయాలి. బాగా మిక్స్ చేసిన తరవాత దాల్చిన చెక్క వేయాలి. ఈ రెండూ వాటర్ లో బాగా కలిసిన తరవాత అలాగే ఓ పది నిముషాల పాటు ఉంచాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు వడబోయాలి. అంతే. ఇలా స్కిన్ డిటాక్స్ డ్రింక్ తయారైపోతుంది. అయితే..ఈ వాటర్ ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితేనే మంచిది. దీని వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రోజ్ పెటల్స్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా ఉన్న వాటిని సరైన విధంగా ఎండబెట్టి వాడుకుంటే బెటర్. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచిన వాటిని వాడకూడదు.


ఎలా వాడితే మంచిది


ఈ స్కిన్ డిటాక్స్ డ్రింక్ సరైన విధంగా ప్రభావం చూపించాలంటే పరగడుపున తాగాలి. లేదా రాత్రి నిద్రపోయే ముందు తాగినా మంచిదే. అయితే..రెగ్యులర్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 21 రోజుల పాటు ఉదయం లేదా రాత్రి ఓ కప్పు డ్రింక్ తాగాలి. ఆ తరవాత మళ్లీ వారం లేదా పది రోజుల పాటు గ్యాప్ ఇవ్వాలి. ఆ తరవాత మళ్లీ 21 రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సరైన విధంగా డ్రింక్ పని చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..గర్భిణీలు ఈ డ్రింక్ తాగకూడదు. వైద్యుల సూచనలు తీసుకున్న తరవాత తీసుకుంటే మంచిది. ఇక దాల్చిన చెక్క లేదా రోజ్ పెటల్స్ పడని వాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లు కూడా ఈ డ్రింక్ తాగకపోవడం బెటర్. బీపీ లేదా షుగర్ మెడిసిన్ తీసుకునే వాళ్లు కూడా అవాయిడ్ చేయడం ఉత్తమం.


ఎలా పని చేస్తుందంటే


ఇందులో యాడ్ చేసిన రోజ్ పెటల్స్ లో పాలీఫినాల్స్ అధికంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఈ రెండూ చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా స్కిన్ ని చాలా సాఫ్ట్ గా మార్చేస్తుంది. దాల్చిన చెక్క వల్ల రక్త సరఫరా బాగా జరుగుతుంది. చర్మంలోని కణాలకు సరైన విధంగా ఆక్సిజన్ అందుతుంది. తద్వారా సెల్స్ యాక్టివ్ అవుతాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అంతే కాదు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై ఉండే బ్యాక్టీరియాని తొలగిస్తాయి.

Latest News
Israel fighting for rights of Christians: PM Netanyahu Mon, Apr 27, 2026, 10:08 AM
Sensex, Nifty trade higher in early session on global optimism Mon, Apr 27, 2026, 10:02 AM
Heatwave in Rajasthan: Barmer, Jaisalmer record 46 degrees Mon, Apr 27, 2026, 09:59 AM
India, New Zealand set to sign key FTA to double trade, boost ties Mon, Apr 27, 2026, 09:47 AM
Heavy rain alert for western TN, strong winds likely till May 2 Mon, Apr 27, 2026, 09:42 AM