అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తులో కీలక విషయాలు.. 3 నెలల క్రితమే
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 06:48 PM

ఈనెల 12వ తేదీన అహ్మదాబాద్‌ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద సమయంలో విమానంలో పైలట్లు, సిబ్బంది ప్రయాణికులు కలిసి మొత్తంగా 242 మంది ఉండగా.. అందులో ఒకే ఒక్క వ్యక్తి మినహా అంతా చనిపోయారు. ఇక ఆ విమానం మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై పడటంతో అక్కడ మరో 30 మందికి పైగా ప్రాణాలు విడిచారు. అయితే విమానం కుడి ఇంజిన్‌లో సమస్య తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం 3 నెలల క్రితమే ఆ ఇంజిన్‌కు మరమ్మతులు చేసినట్లు తాజాగా నిర్వహించిన దర్యాప్తులోవెల్లడైంది.


ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు ముఖ్యంగా కుడివైపు ఇంజిన్‌పై దృష్టి సారించారు. ఆ ఇంజిన్‌ను ఈ ఏడాది మార్చిలో ఓవర్‌హాల్ చేసి తిరిగి అమర్చినట్లు గుర్తించారు. అంటే మరమ్మతులు చేసిన కొద్ది నెలలకే ఇలా జరగడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. దాదాపు 12 ఏళ్ల నాటి బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానానికి చివరిసారిగా 2023 జూన్‌లో పూర్తిస్థాయిలో నిర్వహణ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ ఏడాది డిసెంబర్‌లోతనిఖీలు చేయాల్సిఉంది. ఇంజిన్ ఓవర్‌హాల్ చేసిన తర్వాత ఇంత తక్కువ సమయంలోనే ప్రమాదం జరగడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మరింత లోతైన విచారణ జరుగుతోంది.


ఈ ప్రమాదం తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానాలన్నింటికీ భద్రతా తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు ఎయిరిండియాకు చెందిన 33 బోయింగ్ 787 విమానాల్లో తొమ్మిదింటికి తనిఖీలు పూర్తి చేశారు. మిగిలిన విమానాలను అధికారులు ఇంకా తనిఖీలు చేస్తున్నారు.


డీజీసీఏ ఆదేశాల ప్రకారం వన్ టైమ్ భద్రతా తనిఖీలను పూర్తి చేసే పనిలో తాము ఉన్నామని ఎయిరిండియా ప్రకటించింది. బోయింగ్ 787 విమానాలు తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత వాటిని మళ్లీ నడపడానికి అనుమతి ఇవ్వడానికి ముందు ఈ తనిఖీలు జరుగుతున్నాయని తెలిపింది. డీజీసీఏ ఇచ్చిన గడువులోగా మిగిలిన 24 విమానాలకు కూడా తనిఖీలను పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఎయిరిండియా తెలిపింది. ఈ తనిఖీల వల్ల విమానాల రాకపోకల్లో ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే విమానాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది.

Latest News
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM
PM Modi gets grand welcome in Varanasi, women power in spotlight Tue, Apr 28, 2026, 04:46 PM
Markets end lower as crude oil surge weighs; mid, small caps outperform Tue, Apr 28, 2026, 04:43 PM
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM