తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 05:09 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుని కానుకల్ని, విరాళాలను అందిస్తుంటారు. కొందరు భక్తులు హుండీల్లో డబ్బులు, వెండి, బంగారం, విలువైన వస్తువుల్ని సమర్పిస్తారు. మరికొందరు భక్తులు మాత్రం స్వామివారి పేరుతో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలు అందిస్తారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు సీ శ్రీనివాస అనిదుర్త్ టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10,00,116 విరాళంగా అందజేశఆరు.. ఈ మేరకు భక్తుడి బదులు తిరుపతికి చెందిన రాఘవేంద్ర విరాళం డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంప్ ఆఫీసులో అందజేశారు. ఈ సందర్భంగా భక్తుడ్ని టీటీడీ అడిషనల్ ఈవో అభినందించారు.


ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలతో మొటిమల వల్ల తెరుచుకున్న రంధ్రాలు మూసుకుపోతాయి, మీ ముఖం చూడచక్కగా మారుతుంది


టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదల ప్రాణాలు నిలబడ్డాయి. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ ట్రస్ట్ ద్వారా పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించడం, వైద్య పరిశోధనలకు సాయం అందుతోంది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారికి సహాయం చేస్తోంది. ఇటీవల కాలంలో ట్రస్ట్‌కు భారీగా విరాళాలు అందుతున్నాయి.


తిరుచానూరు శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాల‌తో వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్‌ సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. కాగా బుధ‌వారం రాత్రి స్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు.


శ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్‌ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు (ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తోంది.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM