|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 12:06 PM
కొడాలి నాని అరెస్టుపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పష్టం చేశారు. కోల్‌కతాలో ఆయన్ను అరెస్టు చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆయన అరెస్టు అయ్యాడని వస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని సూచించారు.కొడాలి నానిపై రాష్ట్రంలో కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆయన్ను కోల్‌కతా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు ఈ ఉదయం నుంచి వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీంతో ఏపీ పోలీసులు స్పందించారు. కొడాలి నానిని అరెస్ట్ చేశామన్నది ప్రచారం మాత్రమేనని, నిజం కాదని తెలిపారు. అయితే ఆయనపై పలుచోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో కొడాలిపై లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు.
Latest News