|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:16 AM
ప్రభుత్వాస్పత్రుల్లో నిత్యావసర మందులకు కొరత లేకుండా చూడాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సృష్టం చేశారు. మంగళవారం ఏపీఎంఎస్‌సఐడీసీ కార్యాలయానికి వెళ్లిన ఆయన, అధికారులతో చర్చించారు. మందుల కొనుగోలు, వివిధ ప్రభుత్వాస్పత్రులకు వాటి సరఫరాపై సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కారణాల వల్ల 150కి పైగా మందుల లభ్యతలో కొరత ఉండేదని, తాజాగా తొమ్మిది రకాల మందుల కొరత మాత్రమే ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో 712 రకాల మందుల అవసరాన్ని గుర్తించగా.. ఏపీఎంఎస్‌సఐడీసీ 650 రకాల మందులు కొనుగోలు చేస్తోందని, తక్కువ మోతాదులో అవసరమయ్యే 56 రకాలను ఆస్పత్రుల స్థాయిల్లో సమీకరించుకుంటున్నారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆస్పత్రుల అవసరాలకు అనుగుణంగా మందులు కోనుగోలు చేయాలని సూచించారు. ఏపీఎంఎస్‌సఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఎండీ గిరీశ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Latest News